కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,949 కొత్త కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,949 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,276 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,949 కొత్త కేసులు.. 10 మరణాలు

Updated on: Oct 04, 2020 | 9:09 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,949 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,276 కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,163  చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,366 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,70,212 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 27,901 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 51,623 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 32,05,249 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 291, ఆదిలాబాద్ 24, భద్రాద్రి కొత్తగూడెం 71, జగిత్యాల్‌ 45, జనగాం 31, జయశంకర్ భూపాలపల్లి 24, జోగులమ్మ గద్వాల్‌ 22, కామారెడ్డి 56, కరీంనగర్‌ 114, ఖమ్మం 85, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 31, మహబూబాబాద్‌ 36, మంచిర్యాల్‌ 30, మెదక్‌ 29, మేడ్చల్ మల్కాజ్‌గిరి 150, ములుగు 28, నాగర్‌ కర్నూల్‌ 28, నల్గొండ 124, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 25, నిజామాబాద్‌ 66, పెద్దంపల్లి 43, రాజన్న సిరిసిల్ల 55, రంగారెడ్డి 156, సంగారెడ్డి 42, సిద్ధిపేట్‌ 76, సూర్యాపేట 65, వికారాబాద్‌ 26, వనపర్తి  25, వరంగల్‌ రూరల్‌ 32, వరంగల్‌ అర్బన్‌ 63, యాద్రాది భువనగిరి 34 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. భోరున ఏడ్చేసిన మోనాల్‌

Bigg Boss 4: ఇంగ్లీష్‌ మాటలు.. ఆ ఇద్దరికి క్లాస్ పీకిన నాగార్జున

Loading...
Unable to load recommendations.
Follow Us