కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,708 కొత్త కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,708 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,708 కొత్త కేసులు.. 5 మరణాలు

Updated on: Oct 13, 2020 | 9:13 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,708 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,792 కు చేరింది. 24 గంటల్లో 5 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,233 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,009 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,89,351 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో46,835 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 36,24,096 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 97, జగిత్యాల్‌ 33, జనగాం 21, జయశంకర్ భూపాలపల్లి 23, జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 46, కరీంనగర్‌ 86, ఖమ్మం 81, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 8, మహబూబ్‌ నగర్‌ 33, మహబూబాబాద్‌ 34, మంచిర్యాల్‌ 31, మెదక్‌ 30, మేడ్చల్ మల్కాజ్‌గిరి 124, ములుగు 29, నాగర్‌ కర్నూల్‌ 33, నల్గొండ 81, నారాయణ్‌పేట్‌ 14, నిర్మల్‌ 21, నిజామాబాద్‌ 66, పెద్దంపల్లి 29, రాజన్న సిరిసిల్ల 36, రంగారెడ్డి 137, సంగారెడ్డి 16, సిద్ధిపేట్‌ 65, సూర్యాపేట 54, వికారాబాద్‌ 24, వనపర్తి  26, వరంగల్‌ రూరల్‌ 32, వరంగల్‌ అర్బన్‌ 61, యాద్రాది భువనగిరి 25 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: ఆరోగ్యం బాలేకపోయినా.. అఖిల్‌తో రొమాన్స్‌ ఆపని మోనాల్‌

Bigg Boss 4: అరియానా vs సొహైల్‌.. రచ్చ రచ్చ

Loading...
Unable to load recommendations.
Follow Us