చంద్రబాబును చూసి మురిసిపోయిన వైరల్ తాత.. ఊహించని బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి

Chandrababu Naidu: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వృద్ధుడు సత్యనారాయణకు సీఎం చంద్రబాబును ఒక్కసారి చూడాలన్న కోరిక వైరల్ వీడియో ద్వారా నెరవేరింది. సిద్ధాంతంలో ఆయనను ప్రత్యేకంగా కలిసిన సీఎం, కుటుంబ సమస్యలు తెలుసుకుని కుమారుడికి వైద్యసాయం, సత్యనారాయణకు ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

చంద్రబాబును చూసి మురిసిపోయిన వైరల్ తాత.. ఊహించని బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి
Chandrababu Fan Meeting

Edited By:

Updated on: Jun 09, 2026 | 7:47 AM

ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే.

ఆయనను కలవాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. సత్యనారాయణ.. సిద్ధాంతంలో కలుద్దాం అని రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు.. కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలుపించుకున్నారు.

సత్యనారాయణతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. తన అభిమాని కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు.. సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ రకంగా ముఖ్యమంత్రిని చూడాలన్న కోరికతో పాటు సత్యనారాయణ కోరికలను కూడా తీర్చడం అందర్నీ సంతోషానికి గురిచేసింది.

వైరల్ తాతతో ముచ్చటిస్తున్న చంద్రబాబు వీడియో..

 

Loading...
Unable to load recommendations.
Follow Us