
సామాన్యులకు గుడ్ న్యూస్. కూరగాయల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. టమాటా, వంకాయ ధరలు భారీగా తగ్గాయి. దీంతో సామాన్యులకు ఉపశమనం లభించింది. ఇక కాకరకాయ, బీరకాయ ధరలు కాస్త పెరిగాయి. గతంలో టమాటా కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలకగా.. ఇప్పుడు రూ.10కి పడిపోయింది. తరచూ ప్రతీ కూరలో టమాటాలను ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో వీటి ధరలు తగ్గడం కాస్త ఊరటగా చెప్పవచ్చు.

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ.13, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.43, బజ్జిమిర్చి రూ.25, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.10, బీన్స్ రూ.65, క్యారెట్ రూ.20, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడుకాయ రూ.45 పలుకుతోంది.

ఇక కేజీ గోరు చిక్కుడు రూ.28, బీట్ రూట్ రూ.18, క్యాప్చికం రూ.40, ఆలుగడ్డ రూ.18, కీర రూ.16, దోసకాయ రూ.16, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.20, కంద రూ.30, ఉల్లపొరక రూ.18కు లభిస్తోంది. అలాగే చామగడ్డ రూ.30, చిలకడదుంప రూ. 30, గుమ్మడికాయ రూ.30, పచ్చి బఠాణి రూ.40, బొప్పాయి రూ.40కు దొరుకుతుంది

ఇక కిలో ఎండుమిర్చి రూ.240, అల్లం రూ.100, వెల్లుల్లి రూ.140, చింతపండు రూ.180, పండుమిర్చి రూ.80, పల్లికాయ రూ.50, ఉసిరి రూ.100కి కూకట్ పల్లి రైతు బజార్‌లో లభిస్తున్నాయి. ఇక విజయవాడ. గుంటూరులో కూడా ధరలు అటుఇటుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో ధరలను చూద్దాం.

విజయవాడలో కిలో టమాటా రూ.16, వంగ రూ.26, బెండకాయ రూ.24, పచ్చిమిర్చి రూ.25. కాకరకాయ రూ.20, క్యాబేజీ రూ.16, క్యారెట్ రూ.28. దొండకాయ రూ.30, బంగాళదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.20, గోరుచిక్కుడు రూ.22, దోస రూ.18, సొరకాయ రూ.12, చిక్కుళ్లు రూ.36, బీరకాయ రూ.34, చామదుంప రూ.24, బీట్ రూట్ రూ.26, క్యాప్చికం రూ.56 పలుకుతోంది.