Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

|

Nov 14, 2021 | 12:07 PM

తన మూడురోజుల పర్యటనలో భాగంగా నిన్న (నవంబర్ 12) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తిరుపతి చేరుకున్నారు. ఏపీలో ఆయన పర్యటన బిజీ బిజీగా కొనసాగనుంది.

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!
Amit Shah
Follow us on

Amit Shah: తన మూడురోజుల పర్యటనలో భాగంగా నిన్న (నవంబర్ 13) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తిరుపతి చేరుకున్నారు. ఏపీలో ఆయన పర్యటన బిజీ బిజీగా కొనసాగనుంది. ఈరోజు (నవంబర్ 14) 29వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. తిరుపతిలో జరిగే ఈ సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ హాజరుకానున్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, పలు రాష్ట్రాల గవర్నర్‌లు పాల్గొంటున్నారు. ముందుగా అమిత్‌షా తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తారు. అక్కడి స్వర్ణ భారతి ట్రస్ట్‌ను సందర్శించి..పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంటారు.

ఈరోజు తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సదస్సు మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరుగుతుంది. ఈ సదరన్‌ జోనల్ మీటింగ్‌లో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి 26 ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో ఎజెండాతో ఈ సమావేశానికి వస్తున్నాయి.

సదరన్ జోనల్ కౌన్సిల్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ స్వాగత ఉపన్యాసం ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు సీఎం వై ఎస్ జగన్. వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం, విభజన చట్టంలోని హామీల అమలు చేయాలని కోరనున్నారు. అలాగే కుప్పంలో పాలర్ డ్యామ్ నిర్మాణనికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది.ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ ముగియగానే ఏపీ సీఎం జగన్ ఆతిధ్యం వహించే విందుకు హాజరవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కేంద్రం చిన్నచూపుచూస్తోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కూడా ఓరేంజ్‌లో నడుస్తోంది. ఇక మీటింగ్‌ను అడ్డుకుంటామని ప్రకటించింది CPI. ఈ నేపథ్యంలో జరుగుతున్న మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి: Post Office Savings: మీకు తెలుసా? పోస్టాఫీస్ లో చేసే సేవింగ్స్ పై వడ్డీ మాత్రమే కాదు అదనపు టాక్స్ ప్రయోజనాలూ ఉంటాయి.. ఎలాగంటే..

Home Loan: ఇంటి కోసం తీసుకున్న లోన్ ముందస్తుగా చెల్లించడం వలన లాభం ఉంటుందా? టాక్స్ ప్రయోజనం లభిస్తుందా? తెలుసుకోండి!

Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం