Andhra Pradesh: ఈ కొండచిలువకు కోపమెక్కువ.. తగ్గేదేలే అన్నట్లుగా దేన్నైనా మింగేస్తాయి..

కొండచిలువల్లో బర్మా కొండచిలువలకు కోపం ఎక్కువ. వాటి జోలికొస్తే అస్సలు ఊరుకోవు. దేన్నైనా మింగేయాలి అనుకుంటే..

Andhra Pradesh: ఈ కొండచిలువకు కోపమెక్కువ.. తగ్గేదేలే అన్నట్లుగా దేన్నైనా మింగేస్తాయి..
Python

Updated on: Apr 29, 2022 | 1:26 PM

కొండచిలువల్లో బర్మా కొండచిలువలకు కోపం ఎక్కువ. వాటి జోలికొస్తే అస్సలు ఊరుకోవు. దేన్నైనా మింగేయాలి అనుకుంటే ఆ కొండచిలువలు ఏమాత్రం వెనక్కి తగ్గవు. పంతం నీదా నాదా సై అంటాయి. అలాంటి కొండచిలువలు మనకు ఎదురు పడితే.. వామ్మో ఇంకేమైన ఉందా…? దెబ్బకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇక తాజాగా అలాంటి ఓ ప్రమాదకరమైన కొండ చిలువలు కాకినాడలో కలకలం రేపింది.

కాకినాడ జిల్లా సామర్లకోట శివార్లలో కొండ చిలువలు బెంబేలెత్తించాయి. శ్రీభీమేశ్వరస్వామి ఆలయ సమీపంలో రెండు కొండ చిలువలను చేసిన స్థానికులు, భయంతో హడలిపోయారు. స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో కొండ చిలువలను పట్టుకుని, ఫారెస్ట్ అధికారులు అడవిలో వదిలిపెట్టారు. మీరూ వీడియో చూసేయండి.