
విజయవాడ, మే 31: ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న TV9 & KAB Education Expo 2026 నేడు విజయవాడ, విశాఖపట్నంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఘన విజయాన్ని సాధించిన అనంతరం ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులను ఆకర్షిస్తోంది.
విజయవాడలోని SS Convention Centre, లబ్బీపేటలో నేడు చివరి రోజు కార్యక్రమాలు జరుగుతుండగా, విశాఖపట్నంలోని Novotel Visakhapatnam, Dr. NTR Beach Roadలో కూడా ఆదివారం ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఎక్స్‌పోను సందర్శించవచ్చు.
TV9 Network ఆధ్వర్యంలో, KAB Educational Consultants భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు పాల్గొంటున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, లా, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మీడియా, డిజైన్, హోటల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ తదితర కోర్సులపై విద్యార్థులకు ప్రత్యక్ష సమాచారం అందిస్తున్నారు.
ఈ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా ఉచిత నిపుణుల కౌన్సెలింగ్ నిలుస్తోంది. విద్యార్థుల ఆసక్తులు, అర్హతలు, ప్రవేశ పరీక్షల ఫలితాల ఆధారంగా సరైన కోర్సులు, కాలేజీల ఎంపికపై నిపుణులు సూచనలు ఇస్తున్నారు. అలాగే AP-EAPCET, NEET, JEE, ICET, JoSAA వంటి ప్రవేశ పరీక్షల తర్వాత వెబ్ కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియలపై ప్రత్యేక మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఎక్స్‌పోను సందర్శించి విద్యా అవకాశాలు, అడ్మిషన్ విధానాలు, భవిష్యత్ కెరీర్ ఎంపికలపై స్పష్టత పొందవచ్చు. ఒకే వేదికపై సమగ్ర విద్యా సమాచారం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉండటం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది.
ప్రవేశం పూర్తిగా ఉచితం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.