Tirupati: టీవీ9 ఎఫెక్ట్‌.. అంబులెన్స్‌ల అరాచకాలపై స్పందించిన అధికారులు.. బాధ్యులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మృతుల భౌతిక కాయాలను స్వగ్రామాలకు తరలించే సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోన్న దారుణ ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇదే విషయంపై టీవీ9 వరుస కథనాలు సత్ఫలితాలనిచ్చాయి.

Tirupati: టీవీ9 ఎఫెక్ట్‌.. అంబులెన్స్‌ల అరాచకాలపై స్పందించిన అధికారులు.. బాధ్యులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Ambulance Mafia
Follow us

|

Updated on: Sep 29, 2022 | 8:36 AM

బతికుండగా మనుషులను గౌరవించరు. కనీసం చనిపోయాకైనా గౌరవించాలన్న కనీస మానవత్వం అడుగంటిపోతోంది. ఇలాంటి అరాచకాలకి అద్దం పడుతున్నారు తిరుపతి జిల్లా గూడురు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు. దీనిపై టీవీ9 వరుస కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్టపడింది. ఇటీవల తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. చనిపోయిన దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు దండుకుంటోన్న దగుల్బాజీలు తయారయ్యారు. మృతుల భౌతిక కాయాలను స్వగ్రామాలకు తరలించే సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోన్న దారుణ ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఇదే విషయంపై టీవీ9 వరుస కథనాలు సత్ఫలితాలనిచ్చాయి. అక్రమంగా డబ్బు గుంజుతూ అరాచకాలకి పాల్పడుతోన్న వారిభరతం పట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన గూడూరులో కలకలం సృష్టించింది. గూడూరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ ఐదువేల రూపాయలు డిమాండ్‌ చేశాడు. దీంతో ఖంగుతిన్న బాధితులు మరో అంబులెన్స్‌ని ఆశ్రయించారు. అయితే అంతటితో ఆగకుండా మొదట ఐదువేలు డిమాండ్‌ చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌, ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్‌ని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

దీనిపై స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమంగా డబ్బులు దండుకుంటోన్న వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ9 కథనాలకు స్పందించారు అధికారులు. అంబులెన్స్‌ డ్రైవర్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ మురళీ కృష్ణ బాధ్యులైన అంబులెన్స్‌ డ్రైవర్లను అధికారుల సమక్షంలో విచారించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..