
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి సామాన్యు భక్తులకు మరింత వేగంగా స్వామివారి దర్శనం కానుంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది. దీంతో సామాన్యు భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు టీటీడీ అనే చర్యలు చేపడుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటీవల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. దీని వల్ల సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కీలక ప్రకటన చేశారు.
శ్రీవారికి అభిషేక సేవ చేసే సమయంలో కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రోజుకు అదనంగా మరో 15 వేల మంది దర్శించుకునే అవకాశం లభించింది. సామాన్య భక్తులకు దర్శనాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు క్యూలైన్లు, తిరుమలలోని భక్తుల రద్దీని అంచనా వేస్తోంది. దీని ద్వారా రద్దీకి అనుగుణంగా దర్శనాలు కల్పిస్తుంది. ఏఐ కమాండ్ సెంటర్ ఏర్పాటుతో దర్శనాలు మరింత వేగంగా జరుగుతున్నాయి. శ్రీవారి అభిషేక సేవ సేమయంలో 5 వేల సర్వదర్శన భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
ప్రతి గంటకు క్యూలైన్లలోని భక్తుల రద్దీని ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అటు తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలలో నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్మిస్తు్న్నారు. అలాగే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కేంద్రం కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై నెలాఖరుకు వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 2 వేల లీటరల్ పాలను గోశాలలలో ప్రాసెస్ చేయనున్నారు. ఈ పాలను స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగించనున్నారు. ఇక నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను త్వరలో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 80 కిలోల నెయ్యి ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చయనున్నారు. దశలవారీగా 10 వేల లీటర్లకు దీని సామర్థ్యాన్ని పెంచనున్నారు.