Special Entry Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. మూడు నెలల ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..

| Edited By: Anil kumar poka

Mar 19, 2022 | 7:14 PM

Special Entry Darshan: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 21వ తేదీ నుంచి వరుసగా..

Special Entry Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. మూడు నెలల ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..
Follow us on

Special Entry Darshan: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 21వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. మూడు నెలల ప్రత్యేక దర్శన అందుబాటులో ఉండనున్నాయి. ఏప్రిల్‌ నెల కోటాను మార్చి 21, మే నెల కోటాను మార్చి 22, జూన్‌ నెల కోటాను మార్చి 23న విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఆ రోజుల్లో ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనార్థం సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేల టికెట్లు మంజూరు చేస్తారు.

ఇక సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని భూదేవి కంప్లెక్స్‌, శ్రీనివాస కంప్లెక్స్‌, శ్రీ గోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులకు అందించనున్నారు టీటీడీ అధికారులు.

ఇవి కూడా చదవండి:

World Most Happiest Country 2022: ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు.. మళ్లీ అగ్రస్థానంలో ఆ దేశం

KTR America Tour: మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన.. పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా టూర్‌..!