Tirumala: ఇకపై ఆక్టోపస్‌ పహారాలో తిరుమల ఆలయం.. శత్రుదుర్భేద్యం

|

Jul 06, 2023 | 9:15 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు సైతం వస్తారు. వీరందరికీ భద్రత కల్పించడం ఎంతో ప్రధానమైన అంశం. అందుకే ఆక్టోపస్ టీమ్‌ను రంగంలోకి దించారు.

Tirumala: ఇకపై ఆక్టోపస్‌ పహారాలో తిరుమల ఆలయం.. శత్రుదుర్భేద్యం
Octopus Team
Follow us on

ఇకపై తిరుమల శ్రీవారి ఆలయం శత్రుదుర్భేద్యంగా మారనుంది.  ఆలయానికి అక్టోపస్ టీమ్స్‌ పహారా కాయబోతున్నాయి.  ఆక్టోపస్‌ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు చేశారు. బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్స్, డే-విజన్ గ్లాసెస్, అత్యాధునిక ఆయుధాలతో అక్టోపస్ బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఆలయ ముఖద్వారం దగ్గర నిరంతర నిఘా ఉంటుంది. టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కట్టడిలో ఆక్టోపస్ ఆరితేరింది. ఎలాంటిదాడినైనా మెరుపువేగంతో తిప్పికొట్టడంలో వీరు నిష్ణాతులు.

గ్లోక్-19, కోల్ట్9mm, ఫ్రాంచి స్పాస్-15, డ్యూల్‌మోడ్‌ షాట్‌గన్స్‌, స్నైపర్ రైఫిల్స్‌, టేజర్‌గన్స్‌, కార్నర్‌ షాట్స్‌ సిస్టం లాంటి అధునాత ఆయుధాలను అలవోకగా వాడగల సత్తా  ఆక్టోపస్‌ టీమ్‌కు ఉంది. తిరుమల ఆలయ భద్రత, ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీపై ఇటీవలే సెంట్రల్ ఇంటిలిజెన్స్‌ సమీక్ష నిర్వహించింది. ఆ సమీక్ష తర్వాత ఆక్టోపస్‌ టీమ్‌ను శ్రీవారి ఆలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చెయ్యబోతోంది ప్రభుత్వం.

ఆక్టోపస్‌ను కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. NSG కమాండోల తరహాలో వీరికి కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. ఏపీ పోలీసులలో ఒక వింగ్‌ అయిన ఆక్టోపస్ టీం ప్రత్యేక ఆపరేషన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆక్టోపస్ బలగాలు సీఎం జగన్‌కు సైతం భద్రత కల్పిస్తున్నాయి. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.