టెక్కలిలో హౌజ్ ఫైట్.. తిరుమలలో ఫోటో షూట్.. ఈ రెంటి నట్టనడుమ సీరియల్‌ను దలదన్నిన సీన్లు చెప్పతరమా! ..డైలాగ్ వార్ వినతరమా! రెండో ఇళ్లు కేంద్రంగా నారీ నారీ నడుమ దువ్వాడ వివాదం.. వారం పది రోజులు నాన్ స్టాప్ లొల్లే లొల్లి. కోర్టు ఆర్డర్‌తో ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణీ ప్రయత్నించడం..ఈ ఇల్లు నాదే..ఇంటిపై అధికారం నాదే అంటూ మేడపై మాధురి విలాసం.. ఇదో ట్విస్ట్ భరిత చిత్రమ్.. వాణీ ఇంట్లోకి వెళ్లే గ్యాప్‌లో ఇల్లు తన పేరిట రిజిష్టరైందని ఝలక్ ఇచ్చారు మాధురి. అవేం చెల్లవని వాణీ తన బాణీ విన్పించినా చివరకు ఇంటి ముందు పోరాటానికి తెర వేయక తప్పలేదు. అలాగని వివాదం సద్దుమణగలేదు. మ్యాటర్ కోర్టుకు చేరింది.
స్మాల్ బ్రేక్ తరువాత టెక్కలి ఫ్యామిలీ పిక్చర్ సడెన్‌గా తిరుమలలో తళుక్కుమంది ఇలా. ఔనూ..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు… ఇప్పుడు మ్యాటర్ అది కాదు. పెళ్లి చేసుకోవడానికే కొండకు వచ్చారా? పట్టువస్త్రాల్లో పక్కనే పక్కనే నడవడం..వెంట మందీ మార్బాలం ఉండడం..ఈ సీన్లు చూసిన కొండపై జనం వీళ్లను గుర్తు పట్టారు. వీళ్లు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? పెళ్లి చేసుకొన్నారా? అని గుసగుసలూ గుప్పుమన్నాయి.. ఇక దిల్ అంతా థ్రిల్లింత ఫోటో షూట్ సందడి చూసి వాటెన్ జోష్ గురూ.. అనుకున్నారట భక్తజనం.
ఇంతకీ దువ్వాడ తిరుమల టూర్..సతీ సమేతమా? లేదంటే రిలేషన్ ఇంకా ఆడల్ట్రీ ఫ్రేమ్‌లోనా వుందా? పట్టువస్త్రాల్లో ..ఫార్మల్ డ్రెస్‌లో ఆ ఇద్దరిని చూశాక.. పెళ్లి కోసమే కొండకు వచ్చారనే పుకార్ల లొల్లి మొదలైంది. ఇంతటితో దువ్వాడ ఫ్యామిలీ వార్ కొండెక్కినట్టేనా? చర్చా మొదలైంది…
పెళ్లి చేసుకోవడానికే వచ్చారనే ప్రచారం నిజమే కానీ… ఇప్పుడు ఆ ప్రచారంలో నిజంలేదన్నారు దువ్వాడ శ్రీనివాస్. భక్తితో బ్రహ్మోత్సవాలను చూడ్డానికి తిరుమలకు వచ్చామన్నారు.
గతంలో వెళ్లడం వేరు. టెక్కలిలో జరిగిన కొండంత రచ్చ.. జగమంతా తెలిశాక ఇలా కొండకు రావడం వేరు… దువ్వాడ శ్రీనివాస్ సమాధానం సాగదీసినా.. మాధురి మాత్రం స్ట్రయిట్ అవేగా మ్యారేజ్ కీ బాత్ చెప్పేశారు. పెళ్లి పక్కా.. ఎప్పుడో ఎక్కడో అందరికీ చెప్తామని క్లారిటీ ఇచ్చారు మాధురి.
అదన్న మాట సంగతి. కోర్టు తీర్పుతో ఫ్యామిలీ వార్‌కు ఎండ్ కార్డు పడ్డమే తరువాయి వెడ్డింగ్ బెల్స్ మోగుతాయన్నమాట. టీజర్..ట్రైలర్ తరహా మేడపై విలాసం…కొండపై ప్రకటన… ఇక భవిష్యత్ చిత్రమ్ ఏంటో అర్థమవుతోందా…!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..