Watch: తిరుపతిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

తిరుపతిలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. కొత్త భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా పక్కనే ఉన్న ఈ భవనం కూలిపోయింది. భారీ ఆస్తి నష్టం జరిగింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద కారణాలు, నిర్మాణ నిబంధనల ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Watch: తిరుపతిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Tirupati Building Collapse

Updated on: Aug 26, 2026 | 1:51 PM

తిరుపతిలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. నగరంలోని ఆర్‌సీ రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నూతన భవనం నిర్మాణం కోసం గుంతలు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు కొనసాగుతోంది.

ప్రస్తుతం భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు, నిర్మాణ పనుల్లో ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us