Weather: అండమాన్ లో అల్పపీడనం.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. వాతావరణశాఖ వార్నింగ్..

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకుంటుందని..

Weather: అండమాన్ లో అల్పపీడనం.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. వాతావరణశాఖ వార్నింగ్..
Weather Report
Follow us

|

Updated on: Dec 05, 2022 | 5:44 PM

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకుంటుందని చెప్పింది. దీని ప్రభావంతో డిసెంబర్ 8 న తమిళనాడు, పుదుచ్చేరితో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను తుపాను తాకనుంది. ఈ తుపానుతో భారీ వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు తూర్పు తీరంలో గురువారం వరకు బలమైన గాలులు వీస్తాయి. శుక్రవారం మధ్యాహ్నానికి తుపాను పుదుచ్చేరికి చేరుకుంటుంది. డిసెంబర్ 6 సాయంత్రానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 7 రాత్రి నుంచి తమిళనాడులోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పుదుచ్చేరి, కారైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాలో కూడా డిసెంబర్ 7న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నందున రాబోయే కొద్ది రోజుల పాటు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. డిసెంబరు మధ్యకాలం వరకు ఈశాన్య ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం పరిస్థితి మరికొంత కాలం తీవ్రంగా ఉంటుందని చెప్పింది.

వాతావరణ శాఖ ప్రకారం, డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో లక్షద్వీప్, అండమాన్ నికోబార్లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు వాతావరణం నెలకొంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే