YSRCP: ముగిసిన వైసీపీ తొలి విడత బస్సుయాత్ర.. సంక్షేమ పధకాలతో జనంలోకి దూసుకెళ్లిన నేతలు..

వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార తొలి విడత బస్సుయాత్ర ముగిసింది. ఏపీలోని మూడు ప్రాంతాలను కవర్‌ చేస్తూ.. వైసీపీ బస్సు యాత్రలు చేపట్టింది. 13వ రోజు బస్సుయాత్ర.. పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగింది.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అధికార వైసీపీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే.. పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ.. తాజాగా సామాజిక సాధికార బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టింది.

YSRCP: ముగిసిన వైసీపీ తొలి విడత బస్సుయాత్ర.. సంక్షేమ పధకాలతో జనంలోకి దూసుకెళ్లిన నేతలు..
The First Phase Of The Ysrcp Empowered Bus Yatra Has Ended In Andhra Pradesh
Follow us

|

Updated on: Nov 10, 2023 | 9:43 PM

వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార తొలి విడత బస్సుయాత్ర ముగిసింది. ఏపీలోని మూడు ప్రాంతాలను కవర్‌ చేస్తూ.. వైసీపీ బస్సు యాత్రలు చేపట్టింది. 13వ రోజు బస్సుయాత్ర.. పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగింది.  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అధికార వైసీపీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే.. పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ.. తాజాగా సామాజిక సాధికార బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టింది. తొలి విడతగా పలు నియోజకవర్గాల్లో యాత్రలు చేశారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఫస్ట్‌ ఫేజ్‌లో చివరిరోజున.. పార్వతీపురం జిల్లా సీతానగరం మండలం కాశయ్యపేట సచివాలయాన్ని సందర్శించారు వైసీపీ నేతలు. అనంతరం.. పార్వతీపురం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజ్యాంగ పదవుల్లో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర.

పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. ఈ సందర్భంగా.. ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. మధ్యాహ్నం ధరణికోట బేబీ గార్డెన్స్‌ నుంచి పాదయాత్రగా చేరుకుని గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం.. అమరావతిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, మోపిదేవి వెంకటరమణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. పెద్దతిప్పసముద్రం నుండి మాదవయ్యగారిపల్లె, పులికల్లు మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. ములకలచెరువులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు. బడుగు, బలహీన వర్గాల్లో అన్ని కులాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని చెప్పారు మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌. 2024 ఎన్నికల్లో కట్టకట్టుకుని రాబోతున్న కూటమిని బంగాళాఖాతంలో కలపాలన్నారు. మొత్తంగా.. తొలి విడత వైసీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రలు దిగ్విజయంగా ముగిశాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. వైసీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్రలు కొనసాగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..