సముద్రపు అలలు నీలం రంగులో ఉండటం సహజం..అలంత దూరంగా చూస్తే… ఆకాశం, సముద్రం కలిసిపోయినట్టుగా ఒకే రంగులో కనిపిస్తాయి. అయితే కొన్ని సముద్రాలు ఎరుపు, నీలం రంగులో కూడా దర్శనమిస్తుంటాయి. అలాంటి అరుదైన దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు క్యూ కడుతుంటారు. అయితే అలాంటి దృశ్యం ఏపీలో ప్రతీయేట సందడి చేస్తూనే ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో సముద్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అద్భుత దృశ్యం మరెక్కడో కాదు..ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడలోని ఉప్పాడ సముద్ర తీరంలో కనిపించిన దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత కొన్ని రోజులు క్రితం రెండు రంగులలో కనువిందుగా కనిపించిన సముద్రం స్థానికుల్ని మంత్రముగ్దులను చేసింది. ఆ దృశ్యం ఇంకా అక్కడ అలాగే దర్శనమిస్తోంది. ఇంకా కలవని కఠిన జలాలు, సాధు జలాలూ వేరువేరుగా కనిపిస్తున్నాయి. తీరం పొడవునా బురద నీటి అలలు ఎగిసిపడుతున్నాయి.
తూర్పు తీర ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో బురద నీరుతో నీలి సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారింది..వరద నీరు ఎక్కువగా రావడం తో నీళ్ళు రెండు రంగులలొ కనువిందు చేశాయి. బురద నీటితో కెరటాలు ఉప్పొంగుతున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎర్రగా మారి ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో బురద నీరు చేరి పదిహేను రోజులు గడిచినా ఇంకా ఆ బురదనీరు సముద్రంలో కలవలేదు. పైగా, దీనికి తోడు సముద్ర తీరంలో తూనీగల సందడి కొనసాగుతోంది. గుంపులు గుంపులుగా బీచ్ పోడవునా తూనీగలే దర్శనమిస్తున్నాయి.
దీనికి సంకేతాలు ఏంటని భయాందోళనలకు గురవుతున్నారు తీరప్రాంత వాసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి