ఆ ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించొద్దు.. ముదురుతున్న చీరాల నేతల వివాదం

| Edited By:

Aug 15, 2019 | 3:38 PM

ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం, వైసీపీ నేత ఆమంచి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొనవద్దంటూ అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేపై అక్కడున్న వైసీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల […]

ఆ ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించొద్దు..  ముదురుతున్న చీరాల నేతల వివాదం
Follow us on

ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం, వైసీపీ నేత ఆమంచి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొనవద్దంటూ అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేపై అక్కడున్న వైసీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘటనలో టీడీపీకి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఇరువర్గాలను అక్కడినుంచి చెదరగొట్టారు. చీరాలలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.