Bheemla Nayak: భీమ్లా నాయ‌క్‌పై డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌ స్వామి కామెంట్స్.. నారా లోకేష్ ఏమన్నారంటే..

|

Mar 01, 2022 | 1:21 PM

Bheemla Nayak: ఎన్నికలు ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోని రాజకీయాలు ఎప్పుడూ హీట్ హీట్ గానే ఉంటాయి. అధికార , ప్రతి పక్షాల నేత మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాజాగా టీడీపీ(TDP) నేత..

Bheemla Nayak: భీమ్లా నాయ‌క్‌పై డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌ స్వామి కామెంట్స్.. నారా లోకేష్ ఏమన్నారంటే..
Nara Lokesh Deputy Cm Naray
Follow us on

Bheemla Nayak: ఎన్నికలు ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోని రాజకీయాలు ఎప్పుడూ హీట్ హీట్ గానే ఉంటాయి. అధికార , ప్రతి పక్షాల నేత మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాజాగా టీడీపీ(TDP) నేత నారా లోకేష్(Nara Lokesh) .. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌ స్వామి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్ అనే దళితుడిని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి రైట్‌హ్యాండ్ ఈశ్వర్ రెడ్డి కాళ్లూ చేతులూ విరిచేయ‌డం దారుణమని అన్నారు. ఈ ఘటనతో మరోసారి రాష్ట్రంలో ద‌ళితుల ప్రాణాల‌కు ర‌క్షణ‌లేద‌ని స్పష్టమైందన్నారు లోకేష్. కేవలం ప‌దివేల రూపాయలు  బాకీ చెల్లించ‌లేద‌ని చంద్రన్ ని త‌న మామిడితోట‌కి ఎత్తుకెళ్లిన ఈశ్వర్‌రెడ్డి కాళ్లూ చేతులూ విర‌గ్గొట్టించేయ‌డం పైశాచికానికి ప‌రాకాష్ట అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు నిత్యం సీఎం జగన్ భ‌జ‌నలో మునిగి తేలే ద‌ళిత ఉప ముఖ్యమంత్రి నారాయ‌ణ స్వామికి మీ ద‌ళిత‌జాతికి ఇంత అన్యాయం జ‌రుగుతుంటే స్పందించే సమయం లేదా అంటూ లోకేష్ ప్రశ్నించారు. నారాయణ స్వామికి భీమ్లా నాయ‌క్ సినిమాపై స్పందించే సమయం ఉంది కానీ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో.. ఆదీ త‌న ద‌ళిత‌జాతిని చంపేస్తున్నా.. ప‌ట్టించుకునే తీరిక‌లేక‌లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్ నారాయణ తీరు తీవ్ర విచార‌క‌రం అన్నారు లోకేష్.

 

Read Also: Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

 రెండేళ్ల తర్వాత శివరాత్రికి వెల్లంగిరి కొండలలో మహాశివరాత్రి యాత్ర.. దేశ, విదేశీయుల భక్తులతో కిటకిట

Bheemla Nayak: వివాదంలో భీమ్లానాయక్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి… ఆ సన్నివేశం తొలగించండని ఫిర్యాదు