AP Weather Alert: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. ఆ 5 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు..

|

Sep 02, 2021 | 3:09 PM

AP Weather Alert: దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమాన ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది

AP Weather Alert: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. ఆ 5 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు..
AP Weather
Follow us on

AP Weather Alert: దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమాన ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 km నుంచి 3.1 km ఎత్తు మధ్య ఏర్పడింది. నిన్న దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుంచి 3.1 km నుంచి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులకు వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Rakul Preet Singh: రకుల్‌కు ఈడీ షాక్.. అలాంటి పప్పులేం ఉడకవన్న అధికారులు..

Allu Arjun : అల్లు అర్జున్ రికార్డ్‌ను కేవలం మూడు రోజుల్లోనే రీచ్ ఆయన యంగ్ హీరో.. అతను ఎవరంటే..

YS Sharmila Comments: ఒంటరినయ్యానని చింతిస్తున్న షర్మిల.. వైఎస్సార్ వర్ధంతి రోజు కూడా మాట్లాడుకోని అన్నా చెల్లెలు