AP: గుంటూరు జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి ఘటనలో కొత్త కోణం.. ప్రకంపనలు

|

Apr 28, 2022 | 5:15 PM

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AP: గుంటూరు జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి ఘటనలో కొత్త కోణం.. ప్రకంపనలు
medico death
Follow us on

Guntur District: గుంటూరు జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి ఘటన దుమారం రేపుతోంది. మృతురాలి కుటుంబీకులు గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆరోపిస్తుంటే, పోలీసుల వాదన మరోలా ఉంది. మృతురాలితో నిందితుడికి వివాహేతర సంబంధం ఉందని, అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నేతలు తెనాలి(Tenali) ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. మహిళలపై అత్యాచారాలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కామాంధులు రెచ్చిపోతున్నారని, వీరి అరాచకాలకు కళ్లెం వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు.

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మపూడికి చెందిన మహిళ పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తోంది. భర్త శ్రీనివాసరావు.. వీరికి ఇద్దరు పిల్లలు.. అయితే భర్త శ్రీనివాసరావు పని కోసం తిరుపతి వెళ్లగా.. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటం కలకలం రేపింది. మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా మొదట భావించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. తెలిసినవారే తిరుపతమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఈ కేసులో శివరామకృష్ణ, సాయి, చరణ్‌.. ఈ ముగ్గురు వ్యక్తులపైనే భర్త శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. కొంతకాలంగా తన భార్యను ఫోన్‌లో వేధిస్తున్నారన్న శ్రీనివాస రావు.. ఈ విషయంపై గతంలో గొడవ కూడా జరిగిందంటున్నాడు. నిన్న తమ ఇంటి సమీపంలోనే ఈ ముగ్గురు వ్యక్తులు మద్యం తాగారని శ్రీనివాసరావు చెప్తున్నాడు.

Also Read: Telangana: మతిస్థిమితం లేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్​కానిస్టేబుల్ అత్యాచారం..