Andhra: విద్యుత్తు లైన్‌లో అంతరాయం.. గంటన్నర పాటు ప్రతి స్తంభాన్నీ వెతగ్గా..

ఓ పాము పిల్ల విద్యుత్తు స్తంభం ఎక్కి తీగలను తాకడంతో 33 కేవీ లైన్‌లో ట్రిప్పింగ్ ఏర్పడింది. కారణం తెలుసుకునేందుకు 40 కిలోమీటర్లు తనిఖీ చేసిన విద్యుత్తు శాఖ సిబ్బంది చివరకు అసలు సమస్యను గుర్తించారు. పూర్తి వివరాలు కథనంలో ..

Andhra: విద్యుత్తు లైన్‌లో అంతరాయం.. గంటన్నర పాటు ప్రతి స్తంభాన్నీ వెతగ్గా..
Snakelet

Updated on: Oct 30, 2026 | 7:52 AM

ఒక చిన్న పాము పిల్ల విద్యుత్తు శాఖ సిబ్బందికి పెద్ద పరీక్ష పెట్టింది. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు అనుకుంటే.. ఏకంగా 40 కిలోమీటర్ల విద్యుత్తు లైన్‌ను తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరకు ఓ విద్యుత్తు స్తంభంపైకి ఎక్కిన పాము పిల్లే ఈ అంతరాయానికి కారణమని తేలింది.

గురువారం గుంటూరు జిల్లా మర్రిపాలెం నుంచి ప్రత్తిపాడుకు వచ్చే 33 కేవీ లైన్‌లో విద్యుత్తు సరఫరా పదేపదే నిలిచిపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ట్రిప్పింగ్‌కు కారణం ఏమిటో అంతుచిక్కలేదు. మరోవైపు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా గుంటూరు నుంచి ప్రత్యామ్నాయంగా విద్యుత్తు సరఫరా చేసే ప్రయత్నం చేశారు. అయినా సమస్య రిపీట్ కావడంతో అసలు లోపాన్ని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.

ఏఈ డి.సాంబశివరావు నేతృత్వంలో ఎనిమిది మంది సిబ్బంది రంగంలోకి దిగి లైన్‌లోని ప్రతి స్తంభాన్నీ పరిశీలించారు. దాదాపు 40 కిలోమీటర్లు వెతికిన తర్వాత పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం మర్రిపాలెం వద్ద సమస్యకు కారణం బయటపడింది. ఓ పాము పిల్ల విద్యుత్తు స్తంభం ఎక్కి తీగలను తాకడంతో లైన్‌లో ట్రిప్పింగ్ ఏర్పడినట్లు గుర్తించారు.

పామును తొలగించడంతో విద్యుత్తు సరఫరా మళ్లీ యథావిధిగా ప్రారంభమైంది. అయితే ఈ ఘటనలో పాము పిల్ల ప్రాణాలు కోల్పోయింది. ఓ చిన్న జీవి కారణంగా గంటన్నర పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, దాని ఆచూకీ కోసం సిబ్బంది 40 కిలోమీటర్లు గాలించాల్సి రావడం ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us