స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై నేడే సుప్రీంలో తీర్పు.. ఏం జరుగుతుందో.?

|

Jan 16, 2024 | 12:16 PM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్‌ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై నేడే సుప్రీంలో తీర్పు.. ఏం జరుగుతుందో.?
Chandrababu Naidu
Follow us on

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్‌ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్‌లో తుది విచారణ జరిగినా.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17-ఏ. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాల్లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన.

చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే.. 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదు.. అనేది ప్రభుత్వం తరఫున సీఐడీ చేస్తున్న వాదన. 2021లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగిందని.. అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని బాబు తరఫు లాయర్లు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aకి సంబంధించిన ఈ తీర్పు.. న్యాయవ్యవస్థలో ఒక బెంచ్‌ మార్క్ కాబోతోంది. అందుకే.. చంద్రబాబుతో పాటు.. దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్నీ ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.