YS Sharmila: సీఎం జగన్ దాడిపై షర్మిల రియాక్షన్.. ఏం అన్నారంటే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ దుండగుడు రాళ్లు రువ్వడంతో ఆయన కనుభాగంపై తీవ్ర గాయం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్పందించడంతో పాటు దాడిని ఖండించడమే కాకుండా, షర్మిల ఓ సందేహాన్ని లేవనెత్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ దుండగుడు రాళ్లు రువ్వడంతో ఆయన కనుభాగంపై తీవ్ర గాయం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్పందించడంతో పాటు దాడిని ఖండించడమే కాకుండా, ఓ సందేహాన్ని లేవనెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసి ఎడమ కంటిపై గాయపరచడం బాధాకరమని షర్మిల సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అది యాక్సిడెంట్ అని అనుకుంటున్నాం. అయితే అది ప్రమాదవశాత్తూ జరిగిన దాడి కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి అయితే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఒకవైపు జగన్ పై దాడిని ఖండించిన షర్మిల ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే, ఎన్నికలకు ముందు జరిగిన దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే జగన్ సొంత సోదరి షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.