Andhra: ఇదేం విచిత్రం గురూ.. అరటి చెట్టు మొదలు నుంచి 7 గెలలు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెం గ్రామంలో అరుదైన ప్రకృతి వింత చోటుచేసుకుంది. రైతు ఎలుమర్తి బాబూరావు పొలంలోని ఒకే అరటి చెట్టు మొదలు నుంచి ఏకంగా ఏడు అరటి గెలలు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. .. ..

Andhra: ఇదేం విచిత్రం గురూ.. అరటి చెట్టు మొదలు నుంచి 7 గెలలు..
Banana Tree

Updated on: Oct 05, 2026 | 6:06 PM

సాధారణంగా అరటి చెట్టుకు ఒకే గెల వస్తుంది. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో ప్రకృతి ఓ అరుదైన వింతను చూపించింది. భూమిలోని వేర్ల దగ్గర నుంచి ఒకే అరటి చెట్టు మొదలు నుంచి ఏకంగా ఏడు గెలలు ఏర్పడ్డాయి. దీంతో ఈ వింతను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

మెరకపాలెం గ్రామానికి చెందిన రైతు ఎలుమర్తి బాబూరావు పొలంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా అరటి తోటల్లో ఒకో మొక్కకు ఒకో గెల వస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. వేర్వేరు మొక్కలు కాకుండా.. ఒకే చెట్టు ఏడు అరటి గెలలు బయటకు వచ్చాయి. అది కూడా చెట్టు మొదలు నుంచి రావడం విచిత్రంలా ఉంది.

చెట్టు మొదలు నుంచి ఇలా ఏడు గెలలు రావడంతో స్థానిక రైతులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాబూరావు పొలానికి వచ్చి ఈ వింత అరటి చెట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ప్రకృతి వైచిత్ర్యంగా కనిపిస్తున్న ఈ అరటి చెట్టు ప్రస్తుతం మెరకపాలెంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఒకే మొదలు.. ఏడు గెలలు.. ఇదెలా సాధ్యమైందన్నదే ఇప్పుడు స్థానికుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

వీడియో దిగువన చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us