AP News: అభిమాన నేతకు మంత్రి పదవి వచ్చింది. ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఆ సర్పంచ్. మున్ముందు అంతా మంచే జరుగుతుందని కార్యకర్తలు దగ్గర గర్వంగా చెప్పుకున్నాడు. మంత్రి ఊరేగింపులో కూడా సందడి చేశాడు. అంతలోనే అకస్మాత్తుగా అసువులు బాశాడు. కృష్ణా జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గూడూరు మండలం కొకనారాయణ పాలెం(Kokanarayanapalem) గ్రామ సర్పంచ్ బండి రమేష్(Bandi Ramesh) గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి జోగి రమేష్‌కి దండవేసిన అనంతరం ఊరేగింపుతో వస్తుండగా ఆకస్మికంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో మంత్రి వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుచరులకు సూచించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. బండి రమేశ్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కొకనారాయణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సర్పంచ్ మరణించాడని తెలిసి మంత్రి కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అతనితో తనకు ఎంతో బాండింగ్ ఉందని వెల్లడించారు. బండి రమేశ్ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్…