ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటంబానికి చెందిన ఇద్దరితోపాటు మరొకరు స్పాట్‌లోనే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. వీరు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి […]

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటంబానికి చెందిన ఇద్దరితోపాటు మరొకరు స్పాట్‌లోనే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. వీరు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన నిలిపి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు మరో మహిళ మృతి చెందారు. ఇద్దరుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు పిల్లలు సహా ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu