వాలెంటైన్స్‌ డే అంటే ప్రేమికుల రోజు మాత్రమే కాదు.. ఈ అధికారి ఏం చేసారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ప్రేమికుల దినోత్సవానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రేమికులు మాత్రమే జరుపుకునే రోజు కాదని, పేదలు, దివ్యాంగులతో ప్రేమను పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజు అని ఆయన ఆచరణలో చూపారు. దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి, వారికి బహుమతులు అందించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2015 నుండి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న ఆర్డీఓకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమాజంలో ప్రేమ, సేవా భావాలను ప్రోత్సహిస్తుంది.

వాలెంటైన్స్‌ డే అంటే ప్రేమికుల రోజు మాత్రమే కాదు.. ఈ అధికారి ఏం చేసారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!
Narsapuram Rdo's Unique Valentine's

Edited By:

Updated on: Feb 14, 2026 | 9:27 PM

ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులు పార్క్ లు రెస్టారెంట్ ల చుట్టూ తిరుగుతూ కేక్ లు కట్ చేసి ఒకరికి ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు . ఇది కేవలం వయస్సులో ఉన్న యువతి, యువకులు, లేదా ప్రేమ వివాహాలు చేసుకుని విజయవంతంగా తమ దాంపత్య జీవితం గడుపుతున్నవారు. లేదా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వాళ్ళు మాత్రమే చేసుకునే వేడుకలు కాదు అంటున్నారు ఆ అధికారి. అంతే కాదు ఈ వేడుకలను వినూత్నంగా నిరవహిస్తుంటారు ఆయన.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసిరాజు తన కార్యాలయ సిబ్బంది తో కలసి ప్రేమికుల దినోత్సవం ను వెరైటీ గా దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు . నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచడం తో పాటు వారికి ఎర్రగులాబీలు, స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులు జరుపుకునే రోజు మాత్రమే కాదని ప్రేమను పేదలు దివ్యాంగులతో పంచుకోవడం కూడా అని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ప్రేమికుల రోజును దివ్యాంగుల మధ్య జరుపుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని 2015 నుండి తాను ఎక్కడ ఉద్యోగం చేసినా పేదలు , దివ్యాంగుల మధ్య ప్రేమికుల దినోత్సవం నిరవహిస్తుంటానని అయిన చెబుతున్నారు. దీని ద్వారా వారి స్థితి గతులను తెలుసుకుని వారి జీవనం సుఖమయం చేయడమే తన ఉద్దేశం అంటున్నారు ..ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని తెలియ చేశారు .ప్రేమికుల రోజుకు కొత్త నిర్వచనం చెప్పిన ఆర్డిఓ దాసిరాజుకు దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.