
ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా రెండు పాములు మాత్రమే ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాట ఆడటం చూస్తుంటాం. అయితే ఈసారి ఒకేసారి మూడు పాములు కలసి గంటల తరబడి ఒకదానికొకటి చుట్టుకుంటూ, కదులుతూ, ఎగిరెగిరి సయ్యాట ఆడటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన శివ్వాల ఫకీరు నాయుడుకు చెందిన కల్లం వద్ద ఈ పాములు కనిపించాయి. ఒకదానిపై మరొకటి చుట్టుకుంటూ పైకి లేస్తూ మెలికలు తిరుగుతున్న వాటిని చూసి.. వారంతా ఇది అరుదైన సంఘటనగా భావించారు.
సాధారణంగా ఇలాంటి సయ్యాట సంభోగ కాలంలో అవి ఇలా ప్రవర్తిస్తాయని కొందరు చెబుతున్నారు. అయితే మూడు పాములు ఒకేసారి ఇలా కనిపించడం చాలా అరుదని గ్రామస్థులు అంటున్నారు. అయితే అక్కడే ఉన్న కొందరు యువత వాటి సయ్యాటకు భంగం కలిగించే యత్నం చేశారు. పాములు విషపూరితమైనవిగా కనిపించడంతో పాటు వాటి సయ్యాటకు ఏ మాత్రం భంగం కలిగించినా విరుచుకుపడతాయని అక్కడ పని చేస్తున్న రైతులు, కూలీలు యువతను నిలువరించి ఆ మూడు పాములను చూస్తూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలా సుమారు గంటకు పైగా అంతా భయంభయంగా గడిపారు. ఎవరూ వాటికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొంతసేపటి తరువాత పాములు సమీప పొదల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కాగా అవి జెర్రిపోతు పాములని.. మనిషులకు హాని చేయవని.. ఎలుకలు, పందికొక్కుల్ని తిని రైతులకు మేలు చేస్తాయని నిపుణులు తెలిపారు.
వీడియో దిగువన చూడండి…
గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..