Andhra Pradesh: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్

|

Feb 27, 2022 | 8:54 PM

AP News: ఎక్కడ చూసినా అదే సీన్.. ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక చోట.. పోలీసులు స్మగర్లను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు ఈ మార్గాలను ఎన్నుకుంటున్నారు. 

Andhra Pradesh: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్
Ap News
Follow us on

Krishna District: ఎక్కడ చూసినా అదే సీన్.. ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక చోట.. పోలీసులు స్మగర్లను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు ఈ మార్గాలను ఎన్నుకుంటున్నారు.  ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడింటి గురించి.. ఒకటి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కలప ఎర్రచందనం(Red sandalwood).. శేషాచలం కొండల్లో మాత్రమే లభించే ఈ ఎర్ర బంగారాన్ని దేశాలు దాటించడానికి అక్రమార్కుల నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రెండోది గంజాయి. మూడోది వన్యప్రాణులు… అవును.. ఏనుగు దంతాలు, చర్మం.. జింక చర్మం, పులి గోర్లు.. నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని మన దగ్గరి నుంచి స్మగ్లింగ్ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్టా జిల్లాలో వెలుగుచూసింది. గోనె సంచుల్లో సాధారణంగా అయితే వస్తువులు, సరుకులు తరలిస్తాం. ఇక్కడ కనిపిస్తున్న గోనె సంచుల్లో ఉంది.. వస్తువులు, సరుకులు కాదు. సజీవంగా ఉన్న తాబేళ్లు. వ్యాన్ ఆపగా గోనెసంచులు కదలడం చూసి పోలీసులు కంగుతిన్నారు. దీంతో ఏంటా అని చెక్ చేయగా అసలు బాగోతం వెలుగుచూసింది. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి.. తాబేళ్ళను అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒకటి, రెండు కాదు.. 25 సంచుల్లో 500 తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. మినీ వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై.. ఎంక్వైరీ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.

 

Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ.. రూ.100 చెల్లిస్తే వితౌట్ మాస్క్ చలాన్ క్లియర్