RTC Bus Accident: ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమంటూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్ చేసింది.
‘‘ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొకరికి రూ.2 లక్షల చొప్పున ఎక్సగ్రేషియాను అందిస్తాం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు’’ అని ప్రధాని కార్యాలయం ట్విట్‌లో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన వారికి, ఒక్కొకరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్సగ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు.
— PMO India (@PMOIndia) December 15, 2021
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) December 15, 2021
Also Read: