పలాస 35వ వార్డులో ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు.. లక్కీ డ్రాలో..

Palasa Lucky Draw: శ్రీకాకుళం జిల్లా పలాస 35వ వార్డులో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొంది. రీకౌంటింగ్‌లోనూ అదే ఫలితం రావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ విజయం సాధించారు. .. ..

పలాస 35వ వార్డులో ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు.. లక్కీ డ్రాలో..
Palasa

Updated on: Nov 03, 2026 | 4:03 PM

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలోని 35వ వార్డు ఎన్నిక ఫలితం ఆసక్తికర మలుపు తిరిగింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో విజేత ఎవరనేది ఉత్కంఠగా మారింది. పలాస 35వ వార్డులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయితే రీకౌంటింగ్‌లోనూ ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు పార్టీల అభ్యర్థులకు మళ్లీ సమానంగా ఓట్లు రావడంతో విజేతను నిర్ణయించేందుకు అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు.

ఈ లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ విజయం సాధించారు. దీంతో సమాన ఓట్లతో మొదలైన ఉత్కంఠకు లక్కీ డ్రాతో తెరపడింది. ఓట్ల లెక్కింపులో సమాన ఫలితం రావడం, రీకౌంటింగ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగడం, చివరకు అదృష్ట పరీక్షలో విజయం నిర్ణయించబడటం పలాస 35వ వార్డు ఎన్నికను స్థానికంగా చర్చనీయాంశంగా మార్చింది.

మిగతా చోట్ల ఫలితాల వివరాలు:

బాపట్ల జిల్లా చీరాలలో ఓట్ల లెక్కింపుపై తుఫాన్‌ ప్రభావం పడింది. భారీ వర్షం కారణంగా కౌంటింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ వినోద్‌ ప్రకటించారు.

NTR జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వార్డుల కౌంటింగ్‌ పూర్తయింది. మొత్తం 36 వార్డులకు గానూ కూటమి 12 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగిలిన 24 వార్డుల్లో TDP 14, జనసేన 5, YCP 3, BJP ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us