Operation Firewall: వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!

పాకిస్థాన్‌ నిఘా నీడలో పనిచేసే ఇద్దరూ అమ్మాయిలు విసిరిన వలపు వలలో పడి.. స్వదేశీ రక్షణ రహస్యాలను దాయాదీ దేశం చేతితో పెడుతున్న ముఠాను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం రట్టు చేసింది. దీంతో ఆపరేషన్ ఫైర్ వాల్ చేపట్టి కౌంటర్ సెల్ దేశ వ్యాప్తంగా 18 మంది అనుమానితులను గుర్తించింది. ముఖ్యంగా విశాఖ నేవెల్‌ బేస్‌లో పనిచేసే ఇద్దరి పాత్రపై ఆధారాలు లభించినట్టు తెలిపింది.

Operation Firewall: వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
Navy Honeytrap Pakistan Spy Network Busted, Visakhapatnam (1)

Updated on: Oct 07, 2026 | 8:08 AM

విశాఖ.. తూర్పు తీరంలో భారత్ నౌకాదళ వ్యూహానికి అత్యంత కీలకమైన కేంద్రం. అందుకే శత్రుదేశం నిఘా కూడా ఈ ప్రాంతంపై పడుతోంది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో కొందరు నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కు అందింది. దీంతో సెప్టెంబర్ 2న విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 01/2026గా కేసు నమోదైంది. అప్పట్నుంచి ఈస్పై నెట్ వర్క్ మూలాలను వెతకడం మొదలుపెట్టారు. నెలరోజులపాటు సాగిన దర్యాప్తు తర్వాత అక్టోబర్ ఒకటిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అసలు ఆపరేషన్ ఆపరేషన్ ఫైర్ వాల్-2026 మొదలుపెట్టింది.

ఇందులో మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. అయితే ఈ 18 మందిలో 13 మంది నేవీ సిబ్బందు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వారి దగ్గరున్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయని ఏపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 16 మందిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రస్తుతం గుర్తించిన వారిలో ఇద్దరూ విశాఖకు చెందిన వారే.. అందులో ఒకరు అన్నం సాయివరప్రసాద్. విశాఖలో నేవీ అధికారులకు కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పోలీసుల ప్రెస్ నోట్ ప్రకారం.. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కు చేరవేయడంలో సాయివరప్రసాద్ పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి అతడు డబ్బులు కూడా అందుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో విశాఖలో అతడిని అరెస్టు చేశారు. కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా జైలులో ఉన్నాడు. అంటే కేవలం పాక్ ఆపరేటివ్ తో పరిచయం ఉందన్న అనుమానమే కాదు.. రహస్య సమాచారాన్ని పంచుకోవడం, దానికి సంబంధించి డబ్బులు అందుకోవడంపై ప్రాథమిక ఆధారాలు లభించడం కలకలం రేపుతోంది.

ఇక రెండో నిందితుడు ప్రదీప్ ముఖర్జీ.. విశాఖపట్నం నేవల్ బేస్ కు చెందిన నేవీ ఉద్యోగి. ఇతడిని తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కోసం వాట్సాప్ అకౌంట్ యాక్టివేట్ చేసేందుకు ఓటీపీ షేర్ చేశాడని.. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో కమ్యూనికేషన్ కొనసాగిస్తూ నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చాడని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. కోయంబత్తూరు స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతడిని విజయవాడలోని సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. అతడికి కూడా అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నాడు.

నేవీ ఉద్యోగులను ఉచ్చులోకి దించిన పాక్ ఏజెంట్లు వీరే!

అయితే భారత రక్షణ రహస్యాలు తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా విభాగం తమ వద్ద పనిచేసే ఇద్దరు మహిళలను రంగంలోకి దించింది. వారే నకిలే పేర్లతో నేవి ఉద్యోగులకు పరిచమైన జోషితా పాల్, అన్వి మెహతాల.. ఈ పేర్లతో ఆ పాక్ మహిళలు ఇద్దరూ నేవీ ఫేస్‌బుక్, ఇతర మాధ్యామాల ద్వారా నేవి ఉద్యోగుదలతో పరిచయం పెంచుకొని.. వారికి డబ్బు ఆశ చూపి వారి నుంచి సమాచారం సేకరించి పాక్ నిఘా విభాగానికి పంపేవారని గుర్తించారు అధికారులు. సమాచారం అందిన తర్వాత వారికి క్రిప్టో కరెన్సీ, ఇతర హవాలా మార్గాల ద్వారా డబ్బులు అందేవని గుర్తించింది.

జోషితా పాల్‌ అనే నకలీ పేరుతో ఉన్న ఏజెంట్ తనను తాను ముంబైలోని ఓ నౌకా నిర్మాణ సంస్థలో ఉద్యోగినని చెప్పుకొని ఫేస్‌ బుక్‌ ద్వారా నేవీ అధికారులను, ఉద్యోగులను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత మాయదారి మాటలతో మైమరిపించి.. వాట్సాప్, వీడియో కాల్స్ చేస్తూ వారిని బుట్టలో వేసుకుంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన యుద్దనౌకలు, జలాంతర్గాముల కదిలికలను, కమాండింగ్ ఆఫీసర్ల వివారలను పంపాలని.. అలా చేస్తే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశచూపి సమాచారం దోచుకెళ్లేదని అధికారులు గుర్తించారు.

అన్వి మెహతా అనే మరో నకిలీ ఏజెంతు తనను తాను దిల్లీకి చెందిన సైకాలజిస్ట్‌నని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా నౌకాదల అధికారులతో పరిచయం పెంచుకున్నట్టు గుర్తించారు అధికారులు.ఈమె కూడా వాట్సప్‌, వీడియో కాల్స్‌ ద్వారా ఉద్యోగులను మాయ చేసి, వారిని ముగ్గులోకి దించిన తర్వాత అసలు గేస్ట్ స్టార్ట్ చేసేవారట. తమకు నేవీలోని నౌకల ఫొటోలు, వీడియో పంపాలని, వీడియో కాల్స్‌లో వాటిని చూపించాలని కోరేవారట. ఇలా భారత రక్షన వ్యవస్థకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరించి.. పాక్ నిఘా విభాగానికి పంపే వారని అధికారులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us