Olive Ridley Turtle: అలసట లేని వలస జీవులైన అరుదైన తాబేళ్లు(Turtle) వందలాది మృత్యువాత పడ్డాయి. జీవంలేని వందలాది అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని రట్టి నుంచి బారువ కొత్తూరు తీరం వరకు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. ఇలా అరుదైన ఆలివ్ రెడ్లీ తాబేళ్ల మృత్యువాత పడడానికి కారణం మత్స్యకారులు నిషేధిత వలలు వేటకు వినియోగించమేనని తెలుస్తోంది. ఈ వలలు తాబేళ్లు పాలిట యమపాశాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మృత్యువాత పడి తీరానికి కొట్టుకు వచ్చిన తాబేళ్లను.. జాలరులు ఇసుకలో కప్పెడుతున్నారు.
అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు ఒకటి. ఈ తాబేళ్లలో అనేక రకాల జాతులున్నాయి. అయినప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం ఉండదు. ఇవి రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ తాబేళ్లు కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి.
ఈ తాబేళ్ల జీవితం అంతా సముద్రంలోనే గడుపుతాయి. అయితే గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. తమకు జన్మనిచ్చిన చోటే.. మళ్ళీ అక్కడే గుడ్లు పెట్టే జీవి ఒక్క సముద్ర తాబేలు మాత్రమే.
Also Read: Health Tips: ‘జీలకర్ర’ను ఈ సమయంలో తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసోంతం.. పూర్తి వివరాలు మీకోసం..