నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజలు!

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు వెలవెలబోతుండటంతో పాటు నదుల్లో నీరు ఇంకిపోయి ఎండిపోతున్నాయి. ఈ తీవ్ర వర్షాభావం అన్నదాతలను, గ్రామీణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో వర్ష భగవానుడైన వరునుడి కటాక్షం కోసం అనంతపురం జిల్లాలో అర్చకులు నిర్వహించిన వినూత్న వరుణ జపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజలు!
Priests Varuna Japam

Edited By:

Updated on: Oct 07, 2026 | 6:58 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు వెలవెలబోతున్నాయి… నదుల్లో చుక్క నీరు లేక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో వరునుడి కటాక్షం కోసం అనంతపురం జిల్లాలో అర్చకులు వినూత్న రీతిలో పూజలు నిర్వహించారు. దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పూర్వకాలంలో మునులు ఒంటికాలిపై తపస్సు చేసినట్లే… ఆధునిక యుగంలో తాడిపత్రిలో అర్చకులు చేసిన వరుణ జపం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది!

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలోని అశ్వర్థ నారాయణస్వామి క్షేత్రం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుతూ శ్రీ అశ్వర్థ నారాయణస్వామి ఆలయం, అలాగే శ్రీ చక్రభీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, చైర్మన్ శివశంకర్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు.

అయితే, ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే… సాధారణంగా నదులు, చెరువులు లేదా పుష్కరిణుల్లో దిగి అర్చకులు వరుణ జపం చేస్తుంటారు. కానీ, సమీపంలోని పెన్నానదిలో చుక్క నీరు లేకపోవడం, చెరువులన్నీ ఎండిపోవడంతో అర్చకులు ఒక విచిత్రమైన ఆలోచన చేశారు. ఆలయ ప్రాంగణంలోనే పెద్ద పెద్ద గంగాళాలు, భారీ వంట పాత్రలను ఉంచారు. వాటిలో నీటిని నింపి… అర్చకులు మెడ వరకు నీటిలో మునిగి కూర్చుని నిష్టతో వరుణ జపం నిర్వహించారు! ప్రకృతి కరుణించాలి… వరుణుడు వర్షాల రూపంలో కురవాలి… పాడిపంటలతో ఊరూ వాడా సస్యశ్యామలం కావాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంగాళాల్లో కూర్చుని అర్చకులు చేసిన ఈ విచిత్ర వరుణ జపం ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us