వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు.. పరిష్కారం ఉందంటున్న శాస్త్రవేత్తలు

Neem trees drying in West Godavari: పాలకొల్లు పరిసర గ్రామాలలోని వేప చెట్లు ఇటీవల కాలంలో ఫంగస్ వ్యాధి బారిన పడి ఆకులు, కొమ్మలు ఎండి పోయి పూర్తిగా క్షీణ దశకు చేరుకుంటున్నాయి. మందు స్ప్రే చేస్తామని వాకర్స్ క్లబ్ సభ్యులు తెలియజేశారు.

వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు.. పరిష్కారం ఉందంటున్న శాస్త్రవేత్తలు
Neem Tree

Edited By:

Updated on: Mar 30, 2026 | 10:11 PM

ఎండిపోతున్న వేపచెట్ల పై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తలతో పస్చిమగోదవరిజిల్లలలోని హార్టీ కల్చర్ వి సీ ధనుంజయరావు చర్చలు జరిపారు. డైబ్యాక్ తెగులు, టీ దోమ వల్ల వేపచెట్లకు తెగుళ్లు నుంచి రక్షణకోసం వర్సిటీ శాస్త్రవేత్తలతో కమిటీ వేశారు మరో వైపు తెలుగు సంవత్సరాది వచ్చింది అంటే వేప పువ్వు తో చేసే ఉగాది పచ్చడి తినడం తెలుగు వారి సాంప్రదాయం అటువంటిది ఈ సారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వేప చెట్లకు ఫంగస్ రావడంతో ఆకులు ఎండిపోయి చెట్లు క్షీణదశకు చేరుకున్నాయి. వేప పువ్వులకు ఆకులకు కొరత ఏర్పడింది.

పాలకొల్లు పరిసర గ్రామాలలోని వేప చెట్లు ఇటీవల కాలంలో ఫంగస్ వ్యాధి బారిన పడి ఆకులు, కొమ్మలు ఎండి పోయి పూర్తిగా క్షీణ దశకు చేరుకుంటున్నాయి. ఈ విష యమై పట్టణానికి చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు వృక్షశాస్త్ర నిపుణులను సంప్రదించగా చెట్లకు డై బ్యాక్ అనే ఫంగస్ వ్యాధి సోకడం వల్ల చెట్లు ఆకులు ఎండిపోయి క్షీణి స్తున్నాయని ఈ ఫంగస్ వ్యాధిని నిరోధించాలంటే చెట్ల ఆకులకు కాపర్ ఆక్సి క్లోరైడ్ మందు పిచికారి చేయాలని అలానే చెట్టు మొదలులో వర్మీ కంపోస్ట్ వేసి చెట్టుకు బలాన్ని అందించాలని వృక్ష శాస్త్ర నిపుణులు సూచించారు దీంతో పాలకొల్లు వాకర్స్ క్లబ్ సభ్యులు వేప చెట్టులను సంరక్షించేందుకు ఒక ఉద్యమంలో చేపట్టారు. దీంతో తెలుగు తల్లి వాకర్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ పాల కొల్లు వారు సంయుక్తంగా పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న రెం డు పెద్ద వేప చెట్లతో పాటు పట్టణంలోని 25 వేప చెట్లకు డ్రోన్ సాయంతో కాపర్ ఆక్సి క్లోరైడ్  పిచికారి చేయడంతో పాటు చెట్ల వేరులకు కంపోస్ట్లతో కూడిన పోషకాలు అందించారు.

మానవజాతికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎంతో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు ఇటీవల కాలంలో ఎండిపోయి క్షీణిస్తుండటంతో వాకర్స్ క్లబ్ సభ్యులు అందరము వృక్ష శాస్త్ర నిధులను సంప్రదించగా వారి సూచనలు చేశారని దీన్ని అమలు చేసేందుకు తమ క్లబ్ తరఫున నియోజకవర్గంలోని అన్ని వేప చెట్లకు మందును స్ప్రే చేస్తున్నామని అలాగే ఎవరి ఇంటి వద్ద అయినా వేప చెట్టు ఎండిపోతుంటే తమకు తెలియజేస్తే ఉచితంగా మందు స్ప్రే చేస్తామని వాకర్స్ క్లబ్ సభ్యులు తెలియజేశారు. వేప చెట్లకు వచ్చిన తెగులు పేర “డై బ్యాక్” అంటే చెట్టు పై నుండి మొదలు పెట్టి క్రింద కాండం వరకు వ్యాపిస్తుంది కావున దీని నివారణకు పై ఆకుల నుండి చేపట్టాలని కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు బయటెక్స్ మిశ్రమాన్ని పై నుండి ఆకులకు స్ప్రే చేయడంతో మాట కంపోస్ట్ ఎరువులు ఇవ్వడంద్వారా నివారించవచ్చు అని వృక్షశాస్త్రాన్నిపుణులు తెలుపుతున్నారు.

 

Follow Us