రాష్ట్రానికి అరిష్టమే ఇది..

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో చారిత్రక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం కాలిపోవడం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 8:02 pm, Sun, 6 September 20
రాష్ట్రానికి అరిష్టమే ఇది..

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో చారిత్రక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం కాలిపోవడం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. 60 ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఉపయోగిస్తున్న రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని లోకేష్ అన్నారు. దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైసీపీ పాలనలో లక్ష్మీనరసింహుడి రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని పండితులు అంటున్నారని చెప్పుకొచ్చారు. ఓవైపు గోశాలలో గోవుల మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు రోజుకొక ఆలయంలో అరిష్ట సంకేతాలు వెలువడుతున్నాయని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రథం దగ్ధం కావడానికి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు, నరసాపురం ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేది ఆలయం క్రీస్తు పూర్వం 300 ఏళ్ల నాటిదని, రథం 63 ఏళ్ల కిందట నిర్మితమైనదని తెలిపారు. రథం ఒకేసారి కింది నుంచి పైవరకు కాలిపోయిన విధానం చూస్తుంటే విద్రోహ చర్యలాగే అనిపిస్తోందని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.