మతం ఏదైనా.. నమ్మకం ఒక్కటే! గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు

మనుషులను విభజించేవి కులమతాల సరిహద్దులైతే, వారందరినీ ఒకటిగా కలిపేది భక్తి, ప్రేమ మాత్రమేనని మరోసారి నిరూపితమైంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో లౌకికత్వానికి, మత సామరస్యానికి అద్దం పట్టే ఒక అరుదైన, సుందర ఘట్టం చోటుచేసుకుంది. ఒక ముస్లిం దంపతులు వినాయకుని లడ్డూ వేలంలో పాల్గొని, భారీ ధర చెల్లించి ప్రసాదాన్ని దక్కించుకోవడమే కాకుండా భక్తులందరికీ పంచిపెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.

మతం ఏదైనా.. నమ్మకం ఒక్కటే! గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
Muslim Couple Ganesh Laddu Auction

Edited By:

Updated on: Sep 21, 2026 | 9:34 AM

మతం ఏదైనా.. నమ్మకం ఒక్కటే! భక్తికి కులమతాల సరిహద్దులు లేవని నిరూపించారు ఆ దంపతులు. వినాయక చవితి ఉత్సవాల్లో మత సామరస్యానికి అద్దం పట్టే అరుదైన ఘట్టం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. ​పార్ధసారధి నగర్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట అందరి దృష్టినీ ఆకర్షించింది. లడ్డూ ప్రసాదం కోసం నిర్వహించిన ఈ వేలంలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు పాల్గొని 1,45,000 (లక్షా 45 వేల రూపాయలకు) గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.

​గత 16 సంవత్సరాలుగా తాము వినాయక ఉత్సవాల్లో పాల్గొంటున్నామని, తమ స్నేహితులతో కలిసి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చాందిని తెలిపారు. తనకు కుమారుడు జన్మిస్తే వేలంలో ఎంత ధరైనా చెల్లించి లడ్డూను దక్కించుకుని భక్తులకు ప్రసాదంగా పంచుతానని మొక్కుకున్నానని, ఆ స్వామి అనుగ్రహంతో కుమారుడు పుట్టడంతో ఈ వేలంలో లడ్డూను పాడుకుని మొక్కు తీర్చుకున్నానని చాందిని ఆనందం వ్యక్తం చేశారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం ప్రసాదాన్ని భక్తులందరికీ పంచుతూ తమ లౌకికత్వాన్ని, మత సామరస్యాన్ని చాటుకున్నారు. ​

ధర్మవరంలో నిలిచిన ఈ అరుదైన సన్నివేశం మనుషులందరినీ కలిపేది భక్తి, ప్రేమ మాత్రమేనని మరోసారి నిరూపించింది!… లడ్డు వేలం అనంతరం గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో చాందిని దంపతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us