ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌

అనంతపురం జిల్లాలో మోస్ట్‌వాంటెడ్‌గా స్మగ్లర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అంతర్‌ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్‌వలితో పాటుగా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు క్రాస్‌ వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి రూ. 2,70,000/ల విలువ చేసే ఐదు ఎర్రచందనం దుంగలు, హుండాయ్‌ వెర్నాకారు, ఓ స్కార్పియో, మరో ఐచర్‌ వాహనం, రూ. 25 వేల నగదు, 16 సెల్‌ ఫోన్లను […]

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2019 | 4:46 PM

అనంతపురం జిల్లాలో మోస్ట్‌వాంటెడ్‌గా స్మగ్లర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అంతర్‌ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్‌వలితో పాటుగా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు క్రాస్‌ వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి రూ. 2,70,000/ల విలువ చేసే ఐదు ఎర్రచందనం దుంగలు, హుండాయ్‌ వెర్నాకారు, ఓ స్కార్పియో, మరో ఐచర్‌ వాహనం, రూ. 25 వేల నగదు, 16 సెల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. వీరిలో పట్టుబడిన వారిలో ప్రధాన సూత్రదారి మస్తాన్‌ వలిపై గతంలో 20 కేసులకు పైగా ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్దపప్పూరు రోడ్డు క్రాసింగ్‌లో వాహనాల తనిఖీలు చేపట్టినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే తాడిపత్తి బస్‌స్టాండ్‌ నుండి పెద్దపప్పూరుకు అతివేగంగా వెల్తున్న ఓ వెర్నాకారు, స్కార్పియో, ఐచర్‌ వాహనాలను పోలీసులు అడ్డుకున్నామని, ఆ వాహనాల్లో ఉన్నవారు తమపై రాళ్లదాడి చేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, చాకచక్యంగా వారిని పట్టుకున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. మస్తాన్‌ వలి అక్రమంగా సంపాదించిన డబ్బుతో గతంలో ” ప్రేమ ప్రయాణం’ అనే సినిమా నిర్మించాడని, అందులో నటించిన హీరోయిన్‌ నీతు అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నాడని, అయితే, పెళ్లి తర్వాత మస్తాన్‌ అసలు రూపం తెలుసుకున్న ఆమె మస్తాన్‌ను వదిలేసినట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?