AP Rains: ద్రోణి ప్రభావం.. ఆ జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములతో కూడిన..

AP Rains: ద్రోణి ప్రభావం.. ఆ జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Ap Rain Alert
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2024 | 8:00 AM

ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిమీ ఉండగా, 162.3 మిమీ అత్యధిక వర్షపాతం నమోదైంది. 19 జిల్లాల్లో అత్యధికం, 5 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

రానున్న నాలుగు రోజులు వాతావరణ సూచనలు..

02 జూలై, మంగళవారం:

• శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

03 జూలై, బుధవారం:

• అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

04 జూలై, గురువారం:

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

05 జూలై, శుక్రవారం:

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!