Pawan Kalyan: పవన్‌ను చంపడానికి సుపారీ గ్యాంగ్.. అంతా ఉత్తుత్తే అన్న బొత్స

|

Jun 19, 2023 | 10:35 PM

పవన్‌ కల్యాణ్‌ ... ప్రాణహాని కామెంట్స్‌ పెనుసంచలనం రేపుతున్నాయ్‌!. తనను చంపేందుకు సుపారీకి ఇచ్చారన్న పవన్‌ ఆరోపణలపై భిన్న వాదనలు వినబడుతున్నాయ్‌!. మరి, నిజంగానే పవన్‌ హత్యకు కుట్ర జరిగిందా?. పవన్‌ కామెంట్స్‌పై అధికార వైసీపీ రియాక్షన్‌ ఏంటి?. జనసేన మిత్రపక్షం బీజేపీ ఏమంటోంది!.

Pawan Kalyan: పవన్‌ను చంపడానికి సుపారీ గ్యాంగ్.. అంతా ఉత్తుత్తే అన్న బొత్స
Botsa Satyanarayana vs Pawan kalyan
Follow us on

వారాహి టూర్‌లో పవన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనం రేపుతున్నాయ్‌. తనను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారంటూ పెద్ద బాంబే పేల్చారాయన. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే చంపేయాలని చూశారని అన్నారు. తనను ఎవరు చంపాలనుకున్నారో? సుపారీ ఎవరు ఇచ్చారో ఆధారాలు కూడా ఉన్నాయంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు జనసేన చీఫ్‌. అయితే, పవన్‌ లైఫ్‌ థ్రెట్‌ కామెంట్స్‌పై సెటైర్లేశారు మంత్రి బొత్స. పవన్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. పవన్‌ మాటల్లో కొంచెం కూడా వాస్తవంలేదని, అంతా ఉత్తుత్తి మాటలే అంటున్నారు బొత్స.

సుపారీ గ్యాంగో! పులివెందుల బ్యాచో! ఎర్ర గంగిరెడ్డి టీమో! తెలియదుగాని… పవన్‌కు మాత్రం ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. కేంద్రం కల్పించుకొని వెంటనే Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలన్నారు. పవన్‌కు ప్రాణహానే ఉంటే, అది కేవలం చంద్రబాబు నుంచి మాత్రమే అంటున్నారు కాకినాడ ఎమ్మెల్యే. కాపుల ఓట్ల కోసం పవన్‌ను బాబు ఏమైనా చేస్తారంటూ లాజికల్‌ పాయింట్స్‌ లేవనెత్తారు ద్వారంపూడి.

పవన్‌ వ్యూహం మార్చుకున్నారా?, వారాహి టూర్‌లో సెన్సేషనల్‌ కామెంట్స్‌ వెనుక స్ట్రాటజీ ఉందా?, ప్రాణహాని, సుపారీ స్టోరీ కూడా అందులో భాగమేనా! ఇలాంటి డౌట్సే ఇప్పుడు ప్రత్యర్ధుల నుంచి వస్తున్నాయ్‌!. మరి, వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందా? లేక నిజంగానే అంతమొందించే కుట్రలు జరిగాయా?, ఇప్పుడు కూడా జరుగుతున్నాయా? అనేది పోలీసులే తేల్చాలి!.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..