‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..

ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అయితే రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించారు ఈ ఇద్దరు టీచర్లు. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి భోజన ఖర్చు అందిస్తుండటంతో, అదనపు విద్యార్థుల పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు..

తప్పుకదా సారూ.. శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..
Teachers Suspended In Mid Day Meal Fraud Case

Edited By:

Updated on: Jul 05, 2026 | 7:20 PM

నంద్యాల, జులై 5: నంద్యాల జిల్లా పులిమద్ది గ్రామం ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఒకే ఒక స్టూడెంట్ ఉన్నారు. కానీ 14 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ప్రతి రోజు మధ్యాహ్నం ప్రభుత్వమే భోజనం పెడుతోంది. అందుకుగాను ప్రతి విద్యార్థికి కొంత మొత్తాన్ని ఆ పాఠశాలకు కేటాయిస్తోంది. ఈ పాఠశాలకు రెగ్యులర్ కింద ఇంచార్జి కింద ఇద్దరు టీచర్లు కృష్ణారావు విజయభాస్కర్ పనిచేశారు. వాస్తవంగా స్కూలులో ఒకే ఒక్క విద్యార్థి ఉన్నారు. కానీ మరో 13 మంది విద్యార్థులు కలిపి 14 మంది ఉన్నట్లు అటెండెన్స్ చూపిస్తున్నారు యాప్ లో నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు 14 మంది విద్యార్థులకు సరిపడా భోజనం డబ్బులు తినేస్తున్నారు.

ఒకరోజు అటెండెన్స్ లో 11 మంది చూపించి యాప్ లో మాత్రం 14 మందిని చూపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ పాఠశాలను తనిఖీ చేశారు. అసలు గుట్టు రట్టు అయింది. 13 మంది పిల్లలు పాఠశాలకు సంబంధంలేని వారిని అటెండెన్స్ రిజిస్టర్ లో చూపిస్తూ మిడ్ డే మీల్స్ డబ్బులు తినేస్తున్నట్లు రుజువు అయింది. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో టీచర్లు కృష్ణారా,వు విజయభాస్కర్లను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో జనార్ధన్ ప్రకటించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే.. తన శిష్యుల పేరుతో కాసులు కొట్టేస్తున్న వైనం నంద్యాల జిల్లాలో చోటు చేసుకోవడం అమానవీయం. ఇలాంటి గురువులు తమ బుద్ధిని మార్చుకుని సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Follow Us