Kurnool: ఆసుపత్రిలో మహిళ స్నానం చేస్తుండగా నగ్న దృశ్యాల చిత్రీకరణ.. కేకలు వెయ్యడంతో…

కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో ఆదివారం మధ్యాహ్నం నగ్నవీడియో ఉదంతం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు స్థానికులు.

Kurnool: ఆసుపత్రిలో మహిళ స్నానం చేస్తుండగా నగ్న దృశ్యాల చిత్రీకరణ.. కేకలు వెయ్యడంతో...
Accused Eliea

Updated on: Mar 13, 2023 | 7:17 AM

మహిళలకు సేఫ్టీ అనేదే లేదు. ఎక్కడికి వెళ్లినా కీచకులు ఏదో ఒక రకంగా వేధిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలను, యువతులను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు ఇదే పరిస్థితి. కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిసి.. చిదిమేసే క్రూరాత్ములు ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. తాజాగా ఆస్పత్రిలో ఓ ఉన్నాది ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది.

కర్నూలు సిటీలోని సర్వజన వైద్యశాలలో ఆదివారం మధ్యాహ్నం న్యూడ్ వీడియో ఉదంతం కలకలం రేపింది. నిందితుడి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు వాయగొట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్వకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి తన మిత్రుడిని చూసేందుకు హాస్పిటల్‌కు వచ్చాడు. రోగి సహాయకురాలు బాత్రూంలో ఉండగా, గోడపైకి ఎక్కి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఆమె అది గమనించి.. గట్టిగా కేకలు వేయడంతో ఆసుపత్రిలో ఉన్నవారు అతన్ని పట్టుకొని చితకబాదాలు. ఆసుపత్రి భద్రతా సిబ్బంది… ఏలియాను పోలీసులకు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us