Vizag: 2 వేల అప్పు కోసం కూతురి ముందే అవమానించారు.. పాపం ఆ తండ్రి తట్టుకోలేక

విశాఖ మధురవాడ మారికవలసలో విషాదం చోటు చేసుకుంది. రెండు వేలు రూపాయల అప్పు చెల్లించనందుకు వేధించారు. దుర్భాషలాడుతూ మనోవేదనకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్రావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా తల్లడిల్లిపోతుంది. సూటి పోటీ మాటలతో వేధించడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతూ బోరున విలపిస్తోంది ఆ కుటుంబం.

Vizag: 2 వేల అప్పు కోసం కూతురి ముందే అవమానించారు.. పాపం ఆ తండ్రి తట్టుకోలేక
Snakar Rao

Edited By: Ram Naramaneni

Updated on: Feb 19, 2025 | 3:58 PM

వివరాల్లోకి వెళితే.. మారికవలసకు చెందిన దాసరి శంకర్రావు అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేసుకుంటూ మారిక వలసలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.. వారిలో ముగ్గురు ఆడపిల్లలు. రెడ్డి అనే ఫైనాన్సియర్ దగ్గర శంకర్రావు 5 వేలు రూపాయలు అప్పు తీసుకున్నాడు. అందులో కొంత వరకు చెల్లించాడు. మిగిలిన రెండు వేలు కోసం ఫైనాన్సర్ తన ఇంటికి వచ్చాడు. డబ్బు చెల్లించమని అడిగాడు. తర్వాత ఇస్తానని చెప్పడంతో సూటిపోటి మాటలతో.. వేధించాడు. వారం గడువు ఇచ్చాడు.. ఈ లోగా తీర్చకపోతే అంతు చూస్తున్నాని బెదిరించాడు. కూతురు ముందే తండ్రిని అవమానపరిచాడు. దీంతో బిడ్డ ముందు పరువు పోయిందని మనస్థాపానికి గురి అయ్యాడు శంకర్రావు.  ఇంటికి సమీపంలోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడ. నాన్న కోసం వెతుకుతూ కూతురు వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుగా విలపిస్తోంది.

వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు – భార్య అనురాధ

ఫైనాన్షియర్ వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయిదు వేల రూపాయల అప్పు చేశాడు శంకర్రావు. మూడు వేలు చెల్లించినా.. మిగిలిన అప్పుకోసం మానసికంగా వేధించాడని..  అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందుతుంది కుటుంబం. ‘ నా ముందే నాన్నను తీవ్రంగా వేధించారు.. నన్ను కూడా అవహేళనగా మాట్లాడారు..’ అని అంటూ విలపించింది శంకర్రావు కుమార్తె జీవతి. ‘ నాతో అన్నయ్య చెప్పి తీవ్రంగా బాధపడ్డాడు.. రెండు వేల కోసం పరువు తీసినట్టు మదనపడ్డాడు. రెండువేలే కదా చెల్లించేద్దాంలే బాధపడొద్దు అని చెప్పాను.. ఈ లోగానే ఘోరం జరిగిపోయింది’ అని తీవ్రంగా విలపిస్తోంది శంకర్రావు సోదరి లావణ్య.

కేసు నమోదు చేసిన పోతిన మల్లయ్యపాలెం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి