Cryptocurrency: రామలింగస్వామి ఆత్మహత్యతో ఏపీలో బయటపడుతున్న నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ప్రాణాలు తీస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.70 లక్షలు పోగొట్టుకొన్న ఖమ్మం జిల్లాకు చెందిన రామలింగస్వామి (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

Cryptocurrency: రామలింగస్వామి ఆత్మహత్యతో ఏపీలో బయటపడుతున్న నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు
Follow us

|

Updated on: Nov 26, 2021 | 9:46 AM

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ప్రాణాలు తీస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.70 లక్షలు పోగొట్టుకొన్న ఖమ్మం జిల్లాకు చెందిన రామలింగస్వామి (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ క్రిప్టో యాప్‌లో పెట్టుబడి పెట్టిన రామలింగస్వామి.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో.. రూ.70లక్షల అప్పు అయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు కారు లాక్కోని, చెక్కులపై సంతకాలు పెట్టించుకుని వేధించసాగారు. దీంతో ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఏపీలో ఇలాంటి నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు బయటపడుతున్నాయి. అధిక లాభం పొందేందుకు నకిలీ క్రిప్టో కరెన్సీ యాప్‌లో జాయిన్ అయినా రామలింగస్వామికి చివరికి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినకొద్ది మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మృతుడు విజయవాడకు చెందిన ఆనంద్ కిషోర్, నరేష్‌తో కలసి నకిలీ క్రిప్టో కరెన్సీ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. అలాగే పార్ట్‌నర్‌తో కలిసి మరికొంత మందితో పెట్టుబడి పెట్టించిన మృతుడు మలింగస్వామి.

కృష్ణా జిల్లా జొన్నలగడ్డకు చెందిన బాబీ తో రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించాడు రామలింగ స్వామి. ఇక నకిలీ యాప్ మూసి వేయడంతో నష్ట పోయామని పార్టీనర్లు , మధ్యవర్తులపై వేధింపులు ప్రారంభించారు. తన డబ్బులు రాబట్టేందుకు రామలింగస్వామిపై కృష్ణాజిల్లా శివపురం సర్పంచ్ లక్ష్మీనారాయణతో కలిసి బాబీ వేధింపులకు పాల్పడ్డారు.

అయితే బాబీ సిటిల్మెంట్ పేరుతో రామలింగస్వామిని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట రప్పించాడు. రామలింగ స్వామిని బెదిరించి 40 లక్షల విలువైన రెండు కార్లు, 4 లక్షల విలువైన బంగారం, నగదును రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. బాబీతో పాటు సర్పంచ్‌ వేధింపులతోనే రామలింగ స్వామి ఆత్మహత్య హత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభ్యమైంది. ఈ కేసులో పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాపురం గ్రామ సర్పంచ్‌ తేల్ల లక్ష్మణరావు పరారీలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో