బీరుసీసాల లారీకి నిప్పు!

నంద్యాలలో బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైంది. ఇంజిన్‌లో చెలరేగిన మంటలు స్వల్ప వ్యవధిలో లారీ అంతా వ్యాపించాయి. లారీలో ఉన్న సరుకు బీరు సీసాలు కావడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిశాయి. మంటల ధాటికి సీసాలు పగిలిపోయి గాజు పెంకులు వేగంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. డ్రైవర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు […]

బీరుసీసాల లారీకి నిప్పు!
Follow us

| Edited By:

Updated on: May 20, 2019 | 4:01 PM

నంద్యాలలో బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైంది. ఇంజిన్‌లో చెలరేగిన మంటలు స్వల్ప వ్యవధిలో లారీ అంతా వ్యాపించాయి. లారీలో ఉన్న సరుకు బీరు సీసాలు కావడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిశాయి. మంటల ధాటికి సీసాలు పగిలిపోయి గాజు పెంకులు వేగంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. డ్రైవర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.