
కాకినాడ జిల్లా, అక్టోబర్ 10: ఆయనో ఆర్టీసీ డ్రైవర్.. ఏదో సాధించాలనే తపన, విభిన్నమైన ప్రతిభను ప్రదర్శించాలనే పట్టుదల ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కాకినాడకు చెందిన మందపల్లి శ్రీనివాసరావు పేదరికాన్ని అధిగమించి తొమ్మిదో తరగతి వరకు చదివి, తర్వాత ప్రైవేట్గా పదోతరగతి పూర్తిచేసిన ఆయన పొట్టకూటి కోసం లారీ డ్రైవర్ గా మారారు. అనంతరం ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం సాధించారు. ఒకవైపు ఉద్యోగంతోపాటు మరోవైపు తనకిష్టమైన బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్లో 47 పతకాలు సాధించి అందరితో శెహ బాష్ అనిపించుకున్నారు…
ఒలిపింక్స్ లో పతకం సాధించడమే ధ్యేయంగా నిరంతర సాధన చేస్తున్నాడు శ్రీనివాస్ రావు..అదే లక్ష్యం అంటూ ఫిట్ నేస్ కోసం ఈ వయసులో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకంటున్నాడు… జగన్నాథపురానికి చెందిన శ్రీనివాసరావు తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తొమ్మిదో తరగతితో చదువు ఆపేసినా, చదువుపై మమకారంతో పదో తరగతి పరీక్షలు ప్రైవేటుగా రాశారు. అనంతరం జీవనోపాధి కోసం లారీ డ్రైవర్గా మారిన శ్రీనివాసరావు డ్రైవింగ్లో తన ప్రతి భతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం సాధించారు.
విధుల్లో చేరారు. 2004 నుంచి ముదునూరి అక్కిరాజు వద్ద బాడీ బిల్డింగ్ లో శిక్షణ పొందారు. అక్కిరాజు ప్రోత్సాహంతో అదే ఏడాది విశాఖలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరై రెండో స్థానంలో నిలవడంతో శ్రీనివాసరావుపై అందరి దృష్టి పడింది….2004లో మొదలైన వేట..2004లో తన ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస రావు ఇప్పటి వరకు బాడీబిల్డింగ్, వెయింట్ లిఫ్టింగ్లో47 పతకాలు సాధించిన ఘనత జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు సాధిం చారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు…
ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 430 కేజీల విభాగంలో జాతీయ స్థాయిలో మూడు బంగారు పత కాలు సాధించడంతో ఇప్పటి వరకు 47 పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు..
ఇప్పటి వరకు పవర్ లిఫ్టింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించా. ఇక ఒలింపి క్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా కఠోరంగా శ్రమి స్తున్నా. ఇప్పటికే సామర్థ్యాలను మరింత మెరుగు పరచుకునే క్రమంలో షాట్పుట్, హేమర్, డిస్క స్ వంటి క్రీడల్లోనూ సాధన చేస్తున్నా. కష్టపడితే. సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆ దిశగా నా పయనం సాగుతోంది అని టీవీ9 తో శ్రీనివాస్ తన లక్ష్యాన్ని చెప్పుకున్నాడు…
ఛత్తీస్గడ్ భిలాయ్ నగరంలో నిర్వహించిన 29వ జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాకినాడ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధిం చారు. వంద కేజీల బెంచ్ ప్రెస్ విభాగంలో 95 కేజీలు, డెడ్ లిఫ్ట్ విభాగంలో 180 కేజీల బరువు ఎత్తి రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు NCHD శ్రీనివాసరావు పతకం సాధించారు. దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారు.
టీవీ9 తో…శ్రీనివాసరావు మాట్లాడుతూ , ఇంకా ఎన్నో విదేశాల్లో , ఎన్నో జాతి స్థాయిలో పత కాలు సాధించి ఇండియాకు మంచి పేరు తీసుకురావాలని తమకు ఆర్థికంగా ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానన్నారు. నాకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించి నాకు ఒక గుర్తింపు తీసుకురావాలని వేడుకుంటున్నారు శ్రీనివాసరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం