
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ క్వార్టర్స్ లో నాగుపాము కలకలం రేపింది. బైక్ సీటు కింద బుసలు కొడుతూ దర్శనమిచ్చింది ఓ నాగపాము. బైక్‌లో శబ్దం రావడంతో అనుమానం వచ్చి సీట్ ఓపెన్ చేయగా బైక్ యజమాని దెబ్బకు షాక్ అయ్యాడు. కోటనందూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివాజీ.. ఉదయం డ్యూటీకి వెళ్లే సమయంలో బైక్ దగ్గరకు వచ్చేసరికి ఈ సీన్ చూసి కంగుతిన్నాడు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.