చిన్నారి జాహ్నవి కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఆ కియా కారు ఎవరిది..? అదృశ్యమైన 30 రోజులకు..

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో మరో కొత్త మలుపు చోటుచేసుకుంది. అదృశ్యమైన రోజున గ్రామంలో కనిపించిన కియా కారు ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారింది. అదే కారు నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను ఢీకొట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ఆ వాహనానికి జాహ్నవి అదృశ్యంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.

చిన్నారి జాహ్నవి కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఆ కియా కారు ఎవరిది..? అదృశ్యమైన 30 రోజులకు..
Jahnavi Missing Case

Updated on: Jul 06, 2026 | 8:16 PM

చిట్టితల్లి జాహ్నవి ఎక్కడుంది? ఎవరి చెంతన.. ఎలా ఉంది? పామాయిల్ తోటల్లో ఇంచు ఇంచు వదలకుండా గాలించారు.. కొండ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అధికారులు శక్తివంచన లేకుండా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయినా జాహ్నవి జాడ తెలియరాలేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి ‘జాహ్నవి’ జాడ ఇప్పటికీ లభించకపోవడం యావత్ రాష్ట్రాన్ని కలచివేస్తోంది. సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై.. ఇవ్వాల్టికి 30 రోజులైంది.. ఈ క్రమంలోనే.. తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. జాహ్నవి అదృశ్యమైన రోజు సీసీ కెమెరాల్లో కనిపించిన ఒక కియా కారు వ్యవహారం ఈ కేసులో సరికొత్త ట్విస్ట్‌గా మారింది. అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన ఈ కారే నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను కూడా ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసి, చిన్నారి అదృశ్యం కేసుతో దీనికి గల సంబంధంపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారు అదేనని పేర్కొంటున్నారు. జాహ్నవి కేసుతో ఆ కారుకు సంబంధం ఉందేమోనని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కుటుంబ సభ్యులు కోరుతున్నారు.. జాహ్నవి మిస్సయిన 30 రోజులకు .. ఈ కేసులో కియో కారు వ్యవహారం కొత్త అనుమానాలకు దారితీసింది.

గత నెల 6న జాహ్నవితో పాటు కుక్క అదృశ్యం

కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటకు భవానీ- గణేష్ దంపతులు కాపలదారులుగా పనిచేస్తున్నారు. బిడ్డతో పాటు ఇదే ఇంట్లో ఉంటున్నారు. గత నెల 6న జానుతో పాటు శునకం కూడా అదృశ్యమైంది. ఆ రోజు కుక్క హైవేపైకి వెళ్లడం.. ఆందోళనకరంగా ఓ ఆలయం దగ్గర తచ్చాడటం సీసీ కెమెరాలో రికార్డయింది. జూన్ 9న చిన్నారి వెళ్లిన దారిలో కాకుండా అపోజిట్‌ రూట్‌లో తిరిగి ఇంటికొచ్చింది. ఆ తర్వాత మళ్లీ వెళ్లిపోయింది. మరుసటిరోజు జూన్ 10న డాగ్ క్యాచర్ టీమ్‌ అతికష్టం మీద కుక్కను పట్టుకున్నారు. రెండు రోజులు రెస్ట్ ఇచ్చి.. జూన్ 12 జీపీఎస్‌ ట్రాకర్‌ను బలవంతంగా అమర్చి వదిలేశారు. దాదాపు 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత.. జూన్ 13న కుక్క చనిపోయింది. జూన్ 14న పోస్టుమార్టం చేసి.. శరీర భాగాలు విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. జాహ్నవి జాడ కనిపెట్టేందుకు కుక్కే కీలకం అనుకున్నారు. కానీ కుక్క చనిపోవడం.. మిస్సింగ్ మిస్టరీని మరింత జఠిలంగా మార్చేసింది.

500 ఎకరాల అటవీ కొండ ప్రాంతం గాలింపు

జాహ్నవి ఆచూకీ కోసం రోజుల తరబడి 200మంది సిబ్బంది.. దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలించారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, కాలువలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్లతో జల్లెడ పట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీడిపిక్కల సేకరణకు వచ్చే సంచార జాతుల వాళ్లను ప్రశ్నించారు. కానీ ఎక్కడా జాహ్నవికి సంబంధించి క్లూ దొరకలేదు. జాహ్నవి కోసం బెంగతో తిండి మానేసిన తల్లి భవాని అనారోగ్యానికి గురయింది. ఇప్పుడామె కోరుకునేది ఒకటే..నా బాధను అర్థం చేసుకోడి.. నా బిడ్డను ఎక్కడైనా వదిలెళ్లమని. తండ్రి గణేష్‌ ఊరూరా అన్వేషణ కొనసాగిస్తున్నాడు. ఏజెన్సీలోని చింతపల్లి, పాడేరు, లంబసింగి గ్రామాల్లో పోస్టర్లు అంటిస్తున్నాడు. నా బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పాలని కనిపించిన వాళ్లందర్నీ వేడుకుంటున్నాడు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us