ఆ కొండచిలువ ఐడియా మామూలుగా లేదు.. ఏం చేసిందో తెలుసా..? ధైర్యముంటేనే వీడియో చుడండి..

ఓ కొండచిలువ మాత్రం ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ.. ఆ నీటి తొట్టె వరకు చేరుకుంది. అక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ.. ఆ నీటి తొట్టిలోకి దిగింది. లోపల తిష్ట వేసుకుని కూర్చుంది. ఎవరికి అనుమానం రాకుండా కదలకుండా నక్కి ఉంది. దీంతో అక్కడ వాలే పక్షులు ఒక్కసారిగా హడలెత్తాయి. అరుస్తూ ఉన్నాయి.

ఆ కొండచిలువ ఐడియా మామూలుగా లేదు.. ఏం చేసిందో తెలుసా..? ధైర్యముంటేనే వీడియో చుడండి..
Kailasagiri Python

Edited By:

Updated on: Apr 15, 2026 | 11:56 AM

వేసవికాలంలో మనుషులే కాదు మూగజీవాలు కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు విలవిల్లాడిపోతూ ఉంటాయి. ఉష్ణతాపానికి దాహంతో నీటి కోసం వెతుకుతూ ఉంటాయి. ఎక్కడైనా నీరు కనబడితే.. ఆ నీటి చుక్కను గొంతులో ఒక దింపుకొని దప్పిక తీర్చుకుంటూ ఉంటాయి. పెంపుడు జంతువులకు అయితే.. ఆ యజమాని ఆకలి దప్పికలు తీరుస్తూ ఉంటాడు. మరి.. పిచ్చుకలు, కాకులు ఇతర పక్షులకు అయితే పరిస్థితి ఏంటి..? పక్షి ప్రేమికులు అక్కడక్కడ నీటి తొట్టెలను పెట్టి వాటిలో నీరు పోస్తూ ఉంటారు. అధికారులు కూడా కొన్నిచోట్ల పక్షులు మూగజీవాల కోసం నీటి తోటలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. విశాఖలో.. కైలాసగిరిపై కూడా తొట్టెను ఏర్పాటు చేసి పక్షులు, అక్కడ సంచరించే ఇతర జీవుల కోసం నీటిని అందుబాటులో ఉంచారు. అక్కడకు కాకులు ఇతర పక్షులు వచ్చి ఆ తొట్టెపై వాలి.. దప్పిక తీర్చుకుంటూ ఉంటాయి. అయితే.. ఆ నీటి తొట్టెను ఓ కొండచిలువ కాస్త భిన్నంగా వినియోగించుకుంది. వేసవి తాపం నుంచి సేద తీరడమే కాదు.. తన ఆహార వేట కోసం మాస్టర్ ఐడియాను ఆలోచించింది.

కైలాసగిరి కొండపై.. అనేక జీవజాతులు సంచరిస్తూ ఉంటాయి. పిచ్చుకలు, కాకులు, పాములు.. ఉడతలు ఇలా ఆ కొండలు, పొదల్లో వాటికి అనువైన ప్రదేశాల్లో నివాసం ఉంటాయి. ఆహారం వెతుక్కుంటూ ముందుకు వెళ్తాయి. అయితే.. వేసవికాలంలో కైలాసగిరి కొండపై నీరు అంతంత మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో ఆ మూగ జీవాలు వేసవి తాపానికి విలవిల్లాడిపోతూ ఉంటాయి. అయితే.. వాటికోసం కైలాసగిరి కొండపైన దిగువన కొన్నిచోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. వాటిలో నీరు పోశారు. పక్షులు, ఇతర జీవాలు కూడా ఆ నీటిని తాగేందుకు అక్కడికి ఉంటాయి. అయితే.. ఓ కొండచిలువ మాత్రం ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ.. ఆ నీటి తొట్టె వరకు చేరుకుంది. అక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ.. ఆ నీటి తొట్టిలోకి దిగింది. లోపల తిష్ట వేసుకుని కూర్చుంది. ఎవరికి అనుమానం రాకుండా కదలకుండా నక్కి ఉంది. దీంతో అక్కడ వాలే పక్షులు ఒక్కసారిగా హడలెత్తాయి. అరుస్తూ ఉన్నాయి. అటువైపు వెళ్లేవాళ్లు.. ఒక సరిగా నీటి తొట్టె వైపు వెళ్లి చూశారు. ఏమి కనిపించలేదు. నీటి తొట్టి లోపల ఏదైనా ఉందా.. అని తొమ్మిది చూశారు. దీంతో ఆ నీటిలో కలిసిపోయి ఉన్నట్టు భారీ కొండచిలువ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేహ కిరణ్.. నీటి తొట్టెలో నక్కి ఉన్న భారీ కొండచిలువను రిసీవ్ చేశాడు.

వీడియో చూడండి..

అందుకోసమే అందులో నక్కి కూర్చుంది..

ఆ కొండచిలువను రెస్కూ చేసిన తర్వాత.. దాన్ని పరిశీలించాడు కిరణ్ కుమార్.. ఏదైనా అనారోగ్యంతో ఉందా లేక మరే ఇతర కారణం ఉందా అన్నదానిపై పరీక్షించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే తెలివిగా ఆ నీటి తొట్టెలో కొండచిలువ కూర్చున్నట్టు తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్న వారితో షేర్ చేశాడు కిరణ్ కుమార్. దీంతో ఒక్కసారిగా అంతా అవ్వక్కయ్యారు.

అందుకోసమే అక్కడ..

కైలాసగిరి నీటి తోట్టేలో ఆ కొండ చిలువ అలా ఉండడానికి కూడా ఓ కారణముందట. కేవలం చల్లదనం కోసం మాత్రమే ఆ పైథాన్ అలా తిష్ట వేయలేదు. ఆహారం వేట కోసం అక్కడ తొట్టెలో చొరబడి కూర్చుంది. నీటి కోసం ఆ తొట్టపై వాలే పక్షులు జంతువులను.. ఆ కొండచిలువ వేటాడుతుంది. కదలకుండా నక్కి కూర్చుని వేటాడుతూ ఉంది. ఇలా రెస్క్యూ చేసే కొద్ది సమయం ముందు కూడా ఓ పక్షిని వేటాడినట్టు గుర్తించాడు కిరణ్ కుమార్.. ఎందుకంటే దానికి కడుపులో.. అప్పటికే ఓ పక్షి ఉన్నట్టు గుర్తించాడు. దాహం తీర్చుకునేందుకు నీటి కోసం తొట్టిపైకి వాలిన ఓ కాకిని వేటాడి మింగిందని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్. కొండచిలువను రెస్కు చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. నీటి తొట్టెను తన వేటకు అనుకూలంగా మలుచుకొని కొండచిలువ తెలివిని అందరూ చర్చించుకుని అవాక్కయ్యారు. వేసవి సీజన్లో.. చల్లదనం ఉండేచోటకు ఆహారం వెతుంకుంటూ పాములు చేరుతూ ఉండడం సహజమని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్. తన.. జీవితంలో ఓ కొండచిలువ ఇలా తన వేట కోసం తెలివిగా వ్యవహరించడం చూడలేదని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us