AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపిల్ vs అరటిపండు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తినేముందు ఇవి తెలుసుకోండి..

Apple Vs Banana: రోజుకో ఆపిల్ తింటే డాక్టరుకు దూరంగా ఉండవచ్చు అని వినే ఉంటారు.. కానీ అదే అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే ఈ రెండు పండ్లలో అసలైన హెల్త్ ఛాంపియన్ ఎవరు? బరువు తగ్గాలనుకునే వారు ఏది తినాలి.. శక్తి కావాలనుకునే వారు దేనిని ఎంచుకోవాలి? తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 07, 2026 | 7:53 AM

Share
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఆపిల్, అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినవి. రోజుకో ఆపిల్ తింటే డాక్టరుకు దూరంగా ఉండవచ్చు అన్నది ఎంత నిజమో, తక్షణ శక్తికి అరటిపండును మించినది లేదన్నది కూడా అంతే వాస్తవం. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ పోషకమైనది? రోజూ వీటిని తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5
ఆపిల్: USDA డేటా ప్రకారం.. 182 గ్రాముల ఆపిల్‌లో 94 కేలరీలు, 4.37 గ్రాముల ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆపిల్‌లో ఉండే ఫైటోకెమికల్స్ కొన్ని రకాల క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు మరియు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని క్వెర్సెటిన్, కాటెచిన్ వంటి మూలకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, లిపిడ్ ఆక్సీకరణను అరికడతాయి. తక్కువ కేలరీలు ఉండి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచే ఆపిల్, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన చిరుతిండి.

2 / 5
అరటిపండు: 100 గ్రాముల అరటిపండులో 89 కేలరీలు, 358 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇచ్చే సహజ వనరు. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ.. సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసే అథ్లెట్లకు అరటిపండు ఒక పవర్‌ హౌస్ వంటిది. ఇది కండరాల తిమ్మిర్లను తగ్గించి, శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

3 / 5
ఏది ఎంచుకోవాలి? ప్రముఖ పోషకాహార నిపుణురాలు తాన్యా ఎస్ కపూర్ అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటిలో ఏది గొప్పది అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ, బరువు తగ్గడం లక్ష్యమైతే ఆపిల్‌ మంచిది. తక్షణ శక్తి, వ్యాయామం కోసం అయితే అరటిపండు బెస్ట్. ఆరోగ్యవంతులు ఈ రెండింటినీ ప్రతిరోజూ మితంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ పోషకాలను పొందవచ్చు.

4 / 5
ఇలా ట్రై చేయండి: పండ్లను నేరుగా తినడానికి బోర్ కొడితే వెరైటీ కాంబినేషన్లు ప్రయత్నించండి. ఆపిల్ ముక్కలపై పీనట్ బటర్ పూసి తింటే ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా అందుతాయి. తురిమిన ఆపిల్, క్యారెట్ ముక్కలపై కొంచెం నిమ్మరసం, ఉప్పు చల్లి తాజా సలాడ్‌గా తీసుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్ పై పీనట్ బటర్, అరటిపండు ముక్కలు వేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. పెరుగులో నానబెట్టిన ఓట్స్, అరటిపండు ముక్కలు, నట్స్ కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి ఉదయాన్నే తీసుకుంటే ఎంతో ఆరోగ్యం.

5 / 5
Follow Us
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!

వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!

బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?

UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ

ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..

స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..

ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?